Schools Reopen: అదుపులోకి కరోనా.. 11రాష్ట్రాల్లో తెరుచుకున్న స్కూళ్లు.. కొత్త మార్గదర్శకాలు ఇవే!
దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుదల కనిపిస్తోండగా.. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకుని వస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

Schools (3)
Reopening Schools: దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుదల కనిపిస్తోండగా.. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకుని వస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో పాఠశాలలు పూర్తిగా తెరుచుకున్నాయని, 9 రాష్ట్రాల్లో మాత్రమే పాఠశాలు మూసివేసి ఉన్నట్లు చెప్పింది విద్యా మంత్రిత్వ శాఖ.
కరోనా తగ్గుముఖం పట్టినా కూడా మాస్క్‌లు కచ్చితంగా ధరించాల్సిందేనని, దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు కేంద్రం జారీచేసింది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభ సమయంలో కరోనా నిబంధనలు పాటించాలని, బౌతిక దూరంతో క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా మార్గదర్శకాలను అనుసరించాలని, కేంద్రం సూచించిన మార్గదర్శకాలే కాకుండా స్వంత మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
పాఠశాలలకు మార్గదర్శకాలు:
పాఠశాలలో సరైన పారిశుధ్యం, పరిశుభ్రత సౌకర్యాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి
విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి.
స్టాఫ్ రూమ్‌లు, ఆఫీస్ ఏరియాలు, అసెంబ్లీ హాల్స్ ఇతర సాధారణ ప్రాంతాల్లో అన్ని సమయాల్లో బౌతిక దూరం పాటించాలి.
బౌతిక దూరం పాటించడం సాధ్యం కాని చోట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు.
విద్యార్థులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించి పాఠశాలకు రావాలి. రోజంతా ధరించే ఉండాలి.
మధ్యాహ్న భోజన పంపిణీ సమయంలో మాస్క్‌లను తీయాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా బౌతిక దూరం పాటించాలి.
మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, యాక్టివ్ కేసులు కూడా తగ్గాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. గత 14 రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టగా.. జనవరి 21న 17.94% వద్ద నమోదైన రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతానికి తగ్గింది.