మనసులు కలిసిన శుభవేళ: 60 ఏళ్ల వయస్సులో ఒక్కటైన జంట

ప్రేమకి, పెళ్లికి వయస్సుతో పనిలేదు మనస్సులు కలిస్తే చాలు అంటున్న ఓ సీనియర్ సిటిజన్ జంట పెళ్లితో ఒక్కటైన . త్రిశూర్ జిల్లాలోని రామవర్మపురంలోని ప్రభుత్వ ఓల్డేజ్ హోంలో ఈ జంట నివసిస్తుంది. కొచానియన్ మేనన్(67), లక్ష్మీ అమ్మాళ్(65) మధ్య ఉన్న పరిచయం 60 వయస్సులో పెళ్లికి దారితీసింది.
ఆ ఓల్డేజ్ హోం సూపరిడెంట్ జయకుమార్ పెళ్లికి కావల్సిన ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్ వివాహానికి ఆతిధ్యం ఇచ్చిన మెుదటి రాష్ట్రంగా ఒక రకమైన చరిత్రను సృష్టించిందని చెప్పారు. లక్ష్మీఅమ్మాళ్, కొచానియన్ లు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ జంట వివాహాన్ని ఘనంగా జరిపించామని, శుక్రవారం మెహందీ ఫంక్షన్ వేడుక కూడా నిర్వహించామని తెలిపారు. కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్,జిల్లా కలెక్టర్ ఎస్.షానవాస్ సమక్షంలో వీరిద్దరు ఒక్కటైయ్యారు.
అసలు విషయం ఏమిటంటే వీరిద్దరికి 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. గత కొంత కాలంగా వీరిద్దరు టచ్ లో లేకపోవడమే విశేషం. 21 సంవత్సరాల కింద మరణించిన లక్ష్మీ అమ్మాళ్ భర్త దగ్గర కొచానియన్ అసిస్టెంట్ గా పని చేసేవాడు.
భర్త మరణం తరువాత ఆమె బంధువుల వద్ద ఉంటున్న లక్ష్మీ అమ్మాళ్ రెండు సంవత్సరాల క్రితం ఓల్డేజ్ హోంకి వచ్చింది. రెండు నెలల కిందట అదే ఓల్డేజ్ హోంకి కొచానియన్ ఉంటున్నారు. ఈ వయస్సులో వారు పెళ్ళి తో ఒకటి కావటం చాలా ఆనందంగా ఉందని, వయస్సు మీద పడటంతో తాము ఎంతకాలం కలిసి ఉంటామో తెలియకపోయినా ఉన్నంతా కాలం ఒకరి కోసం మరోకరు ఉన్నామనే భావనతో సంతోషంగా జీవిస్తామని లక్ష్మీ అమ్మాళ్ చెప్పారు.