Gurugram : ప్రాణాలు కాపాడిన సెక్యురిటీగార్డ్ ను ఎడాపెడా వాయించిన వ్యక్తి..

ప్రమాదంలో చిక్కుకుని ప్రాణం పోతుందా? అనే భయంతో ఉన్నప్పుడు ఎవరన్నా రక్షిస్తే సమయానికి వచ్చి రక్షించావు దేవుడిలాగా అంటూ కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలు రక్షించిన వ్యక్తిని ఎడాపెడా చెంపలు వాయించేశాడు. దీంతో సదరు వ్యక్తి బిత్తరపోయాడు.

Gurugram : ప్రాణాలు కాపాడిన సెక్యురిటీగార్డ్ ను ఎడాపెడా వాయించిన వ్యక్తి..

Security guard slapped after helping man get out of faulty lift

Updated On : August 30, 2022 / 1:01 PM IST

Gurugram : ప్రమాదంలో చిక్కుకుని ప్రాణం పోతుందా? అనే భయంతో ఉన్నప్పుడు ఎవరన్నా రక్షిస్తే సమయానికి వచ్చి రక్షించావు దేవుడిలాగా అంటూ కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలు రక్షించిన వ్యక్తిని ఎడాపెడా చెంపలు వాయించేశాడు. దీంతో సదరు వ్యక్తి బిత్తరపోయాడు. ఏంటీ కాపాడితే ధన్యవాదాలు చెబుతారు..కానీ ఇతగాడేంటీ ఇలా చెంపలు వాయించేశాడు? అని ఆశ్చర్యపోయాడు.

గురుగ్రామ్‌లోని క్లోజ్ నార్త్ సొసైటీకి చెందిన వరుణ్ నాథ్ అనే వ్యక్తి 14వ అంతస్థులు నివసిస్తున్నాడు. ఈక్రమంలో అతను తన ఉంటున్న 14వ అంతస్తు నుంచి కిందకు రావటానికి లిఫ్ట్ ఎక్కాడు. అతను పూర్తిగా కిందకు రాకుండానే లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. దీంతో లిఫ్ట్‌లో అమర్చిన ఇంటర్‌కమ్ ద్వారా సెక్యూరిటీగార్డు అశోక్‌కు సమాచారం అందించాడు. దీంతో లిఫ్ట్‌మ్యాన్‌ను తీసుకువచ్చి లిఫ్ట్ కిందకు వచ్చేలా చేశాడు. ఇదంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయింది. వరుణ్ నాథ్ కూడా సురక్షితంగా బయటపడ్డాడు.

కానీ వరుణ్ నాథ్ ఆ ఐదు నిమిషాలు లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం తట్టుకోలేకపోయాడు. లిఫ్ట్ దిగీ దిగటంతోనే ఆగ్రహంతో ఊగిపోతు సెక్యూరిటీ గార్డ్ అశోక్ చెంపలు ఎడా పెడా వాయించేశాడు.దీంతో అశోక్ బిత్తరపోయాడు. తాను చేసింది మంచిపనే కదా..మరి ఎందుకు ఇలా కొడుతున్నాడు? అంటూ ఆశ్చర్యపోయాడు. వరుణ్ నాథ్ అక్కడితో ఊరుకోకుండా లిఫ్ట్‌మ్యాన్‌పై కూడా చేయి చేసుకున్నాడు. ఇంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఇలా రెసిడెంట్ చేయి చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులు ఆందోళనకు దిగారు. వరుణ్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎవ్వరం డ్యూటీలు చేయం అంటూ భీష్టించుకుని కూర్చున్నారు. సొసైటీ రెసిడెంట్స్‌కు సేవలు అందించటానికి తాము నిద్ర మానేసి రాత్రి పగలు కాపలాకాస్తుంటే ఇలా చేయి చేసుకుంటారా? అంటూ మండిపడ్డారు. మేము బానిసలమా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నింస్తూ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

వరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన వరుణ్‌ను రక్షించి, బయటకు తీసుకొస్తే తనపైనే దాడిచేశారని అశోక్ కుమార్ వాపోయాడు. సెక్యూరిటీగార్డుల ఫిర్యాదుతో వరుణ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.