విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ

విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ

Sends 200 Buses Agra Rajasthans Kota Evacuate Students

Updated On : July 12, 2021 / 11:23 AM IST

కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పంపించండి)అని విద్యార్థులు మొదలుపెట్టిన ప్రచారం ట్విట్టర్‌లో ట్రెండింగ్ కావడంతో యూపీ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. శుక్రవారం రాత్రి బస్సులు కోటా చేరుకుంటాయని, శనివారం ఉదయం యూపీకి విద్యార్థులతో బయలుదేరుతాయని కోటా డివిజనల్ కమిషనర్ ఎల్ఎన్ సోనీ తెలిపారు.

కోటలో చిక్కుకుపోయిన వేలమంది విద్యార్ధులను రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చేందుకు బస్సులు పంపినట్లు ఆగ్రాలో ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఫుడ్,వాటర్ బాటిల్స్,మాస్క్ లెు,శానిటైజర్లును కూడా పంపించినట్లు తెలిపారు. ఒక్కో బస్సుల్లో 25మందిని తీసుకురానున్నట్లు తెలిపారు. ఝాన్సీ సిటీ నుంచి కూడా కొన్ని బస్సులను పంపినట్లు తెలిపారు. ఎట్టకేలకు తమ ఇంటికి చేరుకుంటున్నామని విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు(పోటీ పరీక్షలు) ప్రిపేర్ అయ్యేందుకు దేశవ్యాప్తంగా వివిధరాష్ట్రాల నుంచి వేలాదిమంది విద్యార్థులు కోచింగ్ సెంటర్స్,ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ కు హబ్ గా ఉన్న కోటకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. మరోవైపు, ఇతర రాష్ట్రాలు కూడా తమ విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. దాదాపు 30 వేలమంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రస్తుతం కోటాలో ఉన్నారు. అయితే కోట నుంచి విద్యార్ధులను స్వరాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులను పంపడం అనేది లాక్ డౌన్ సూత్రాలకు అన్యాయం చేయడమేనని బీహార్ సీఎం నితీష్ కుమార్ విమర్శించారు.

See Also | విపత్తు సమయంలో ఏపీ సీఎం పెద్ద మనస్సు