supreme court : సుప్రీంకోర్టులో కేసు విచారణ..ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించిన న్యాయవాది..

ఓకేసు విచారణను న్యాయవాది ఆసుప్రతి నుంచి తన వాదనలు వినిపించిన అరుదైన సంఘటన సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది.

lawyer attend supreme court from hospital : సుప్రీంకోర్టులో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఓ కేసు విషయంలో సీనియర్ న్యాయవాది ఆస్పత్రి బెడ్ మీదనుంచే వాదనలు వినపించిన ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వర్చువల్ విధానంలోనే సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఓ న్యాయవాది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఓ కేసు సంబంధించి ఆసుపత్రినుంచే వాదనలు వినిపించిన సంఘటన బుధవారం (అక్టోబర్ 6,2021) జరిగింది.

ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన కేసు విచారణలు గత కొంతకాలంగా కొనసాగుతున్న క్రమంలో ఈ కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో విచారణను జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవయ్‌లతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది.

Read more:  Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

ఈ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అనారోగ్యంతో ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఆసుపత్రి నుంచే తన వాదనల్ని వినిపించారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు స్క్రీన్‌పై కనిపించింది. సదరు న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా..ఇంతలో జస్టిస్ నాగేశ్వరరావు కల్పించుకుని..ఈ కేసు విచారణ చేద్దాం కానీ అంతకంటే ముందు లాయర్ గారూ మీ ఆరోగ్యం ఎలా ఉంది? అని పరామర్శించారు.

దానికి సదరు న్యాయవాది. జస్టిస్ మీకు నాపై ఉన్న అభిమానానికి ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదటపడుతోంది అని సమాధానం చెప్పారు. తరువాత వాదనలు కొనసాగాయి. వాదనలు పూర్తి అయ్యాక న్యాయమూర్తులందరి సదరు న్యాయవాది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మీరు త్వరగా కోలుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. దానికి ఆ న్యాయవాది మరోసారి మీకు నా ధన్యవాదాలు అని సవినయంగా తెలిపారు.

Read more:  Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

 

ట్రెండింగ్ వార్తలు