అన్నదమ్ముల అనుబంధం : దేశ విభజనప్పుడు విడిపోయి..ఇన్నాళ్లకు కలుసుకున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 08:11 AM IST
అన్నదమ్ముల అనుబంధం : దేశ విభజనప్పుడు విడిపోయి..ఇన్నాళ్లకు కలుసుకున్నారు

Updated On : March 7, 2019 / 8:11 AM IST

 రాసి పెట్టి ఉంటే ఎప్పుడైనా జరుగక తప్పదు అనే మాట నిజమైంది.ఒకరికొకరు కలుకోవాలని రాసి పెట్టి ఉంది కనుకే ఏడు దశాబ్దాల క్రితం జరిగిన దేశ విభజన సమయంలో విడిపోయిన స్నేహితులు ఇన్నేళ్లకు మంగళవారం(మార్చి-5,2019) కలుసుకున్నారు. దేశ విభజనకు ముందు ప్రస్తుత పాకిస్తాన్ లోని గుర్జన్ వాలా ఫ్రావిన్స్ లో నాలుగేళ్ల పసివాడిగా ఉన్న అమిర్ సింగ్ విర్క్ కు తనకు వరుసకు అన్న అయ్యే తొమ్మిదేళ్ల దల్బీర్ సింగ్ అంటే ప్రాణం. దేశవిభజన జరిగినప్పుడు భారత్ కు తరలిపోతున్న సమయంలో అమిర్ సింగ్ కాలికి దెబ్బ తగిలింది. వెంటనే దల్బీర్ కట్టుకట్టాడు. అదే చివరిసారిగా వారిద్దరూ కలుసుకోవడం. రెండు కుటుంబాలు సురక్షితంగా భారత్ లోకి ప్రవేశించినట్లు వీరికి తెలియదు.హర్యాణాలోని కర్నాల్ లో దల్బీర్,పానిపట్ లో అమిర్ కుటుంబాలు స్థిరపడ్డాయి.అమిర్ ఉత్తరాఖాండ్ లో రైతుగా స్థిరపడ్డాడు. దల్బీర్ ఆర్మీలో చేరాడు.

అయితే అమిర్ మనసు ఎప్పుడూ దల్బీర్ కోసం గాలిస్తూనే ఉండేది.నా స్నేహితుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో,ఎక్కడ ఉన్నాడో అని అమిర్ ఆలోచిస్తూనే ఉండేవాడు. దల్బీర్ కోసం వెతికే క్రమంలో.. గతంలో నివసించిన పాక్ లోని గుర్జన్ వాలాకి 2014లోఅమిర్ వెళ్లాడు. అక్కడే ఉండిపోయిన బంధువులను కలిసి వివరాలు సేకరించాడు.1974 నాటి వివరాలతో ఉన్న ఓ వెబ్ సైట్ లో వెతకడం మొదలుపెట్టిన అమిర్ కు రిటైర్డ్ మేజర్ గా నోయిడాలో ఉంటున్న దల్బీర్ ఆచూకీ తెలిసింది. వెంటనే దల్బీర్ నెంబర్ కు ఫోన్ చేసిన అమిర్..హలో ఐ యామ్ దల్బీర్ స్పీకింగ్ అన్న మాట విని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇద్దరు ఫోన్ లో కొద్దిసేపు బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నారు. చివరికి మంగళవారం వీరిద్దరూ కలుసుకున్నారు.ఈ సమయంలో ఇద్దరు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.ఎలా ఉన్నావు తమ్ముడు..నువ్వు ఎలా ఉన్నావ్ అన్నయ్యా అంటూ ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఏడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న వీరిద్దరిని చూసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు. వీరి కలయికను చూసినవాళ్లందరికీ ఎన్టీఆర్,మురళీమోహన్,బాలకృష్ణలు కలిసి నటించిన అన్నదమ్ముల అనుబంధం సినిమా గుర్తుకు వస్తుంది.