Shashi Tharoor : ఊయల ఎక్కి ఊగిన కాంగ్రెస్ నేత శశీథరూర్..

కాంగ్రెస్ నేత శశీథరూర్ ఎరుపు రంగు కుర్తీ,ధోతీ ధరించి.. నుదుటిన చందన తిలకం దిద్దుకుని ఆడపిల్లలా సిగ్గు పడుతూ ఊయల ఎక్కి ఊగారు. నాకు ఊయల ఊగాలనిపించింది.

Shashi Tharoor Onamin Swing Tradition

shashi tharoor Onamin swing tradition : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశీథరూర్ ఊయల ఊగారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఊయల ఊగురు ఆడపిల్లలా తెగ సిగ్గుపడిపోతూ మురిసిపోయారు. ఓ సీనియర్ రాజకీయ నేత ఊయల ఊగటమేంటీ? ఎందుకెక్కారంటే..కేరళలో ఓనం వేడుకలు ఎంతో వైభవంగా..ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ వేడులను పురస్కరించుకుని కాంగ్రెస్ నేత శశిథరూర్ ఓనం వేడుకల్లో పాలుపంచుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, ఉయ్యాలలో ఊగుతూ ఆనందపడిపోయారు. కేరళ ప్రజలకు ఓనం ఎంతో ముఖ్యమైన పండుగో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.పంట చేతికి వచ్చిన సందర్భంగా ఓనం ఉత్సవాలు చేసుకుంటారు కేరళ వాసులు.

ఓనం వేడుకల్లో పాల్గొన్న శశీథరూర పండుగ సందర్భంగా శశిథరూర్ ఎరుపు రంగు కుర్తీ,ధోతీ ధరించి నుదుటిన చందన తిలకం దిద్దుకుని ఆడపిల్లలా సిగ్గు పడుతూ ఊయల ఎక్కి ఊగుతున్న వీడియోను షేర్ చేశారు. 30 సెకెన్లున్న ఈ వీడియోలో శశీథరూర్ ఉయ్యాల ఊగుతూ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన… ఓనం నాడు ఉయ్యాలలో ఊగడమనేది ఆచారంగా వస్తోంది. సాధారణంగా అమ్మాయిలు ఉయ్యాలలు ఊగుతారు. కానీ ఈసారి నాకు ఉయ్యాలలో ఊగాలని అనిపించింది…మీ అందరికీ ఓనం శుభాకాంక్షలు అని తెలిపారు.

కాగా..కాంగ్రెస్ సీనియర్ నేత శశీథరూర్ భార్య సునంద ఆత్మహత్య కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో థరూర్ పై ఉన్న అభియోగాలన్నింటినీ ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శశీథరూర్ ఏడున్నరేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. గత కొన్ని రోజుల క్రితమే ఇటువంటి క్లియరెన్స్ రావటంతో శశీ థరూర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

తనపై అభియోగాలన్నింటిని ధర్మాసనం కొట్టివేయటంతో శశీథరూర్ ఆనందం వ్యక్తంచేస్తూ..‘‘నా భార్య సునంద మరణం తర్వాత ఎంతో కాలం నా చుట్టూ అలముకున్న కారు చీకట్లు ఈ తీర్పుతో తొలగిపోయాయి. ఆమె మరణంపై నా మీద ఎన్నెన్నో నిరాధారపూరితమైన ఆరోపణలను మోపారు. మీడియా ఎన్నో అభాండాలను వేసింది. కానీ ధర్మం నావైపున ఉంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో న్యాయవ్యవస్థపై నా నమ్మకాన్ని మరింత పెంచింది. తప్పు చేస్తే మన న్యాయవ్యవస్థ కచ్చితంగా శిక్షిస్తుంది. ఏదిఏమైనా న్యాయం జరిగింది’’ అని ఆయన తెలిపారు.