మహా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు ససేమిరా అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కూడా లేటెస్ట్‌గా కలిసిన సోనియా గాంధీ శివసేన పంపుతున్న సంకేతాల తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఓ వర్గం శివసేనతో చేతులు కలపాలని కోరుతున్నా కూడా.. తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం దీర్ఘకాల పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేయలేమని ఆమె అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది.
బీజేపీని అధికారానికి దూరం పెట్టడానికి శివసేనతో చేతులు కలుపుదామన్నది పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్ మొదలైన వారి సూచన కాగా సోనియాతో చర్చల్లో ఆమె అందుకు ఒప్పుకోలేదని పవర్ మాటల్లో స్పష్టం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పడమే ఇందుకు నిదర్శనం. అయితే భవిష్యత్తులో ఏం జరగుతుంతో ఊహించలేము. ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం సోనియాతో చర్చించలేదు అని కూడా ఆయన చెప్పారు. దీని అర్థం సేనతో కలవడం సోనియాకు సమ్మతం కాదని చెప్పకనే చెప్పడం అన్నమాట.
ఇక మహారాష్ట్రలో ఫలితాలు వచ్చి 10రోజులు అవుతున్నా కూడా అధికారం చేపట్టే విషయంలో స్పష్టత రావట్లేదు. బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరట్లేదు. 50-50 ఫార్ములాకి ఒప్పుకుంటేనే మద్దతు అని శివసేన అంటుంది. అందుకు బీజేపీ ఒప్పుకోట్లేదు. ఇప్పటివరకు శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో అయినా ముఖ్యమంత్రి పీఠం ఎక్కొచ్చు అని భావించింది. అయితే కాంగ్రెస్ ఇస్తున్న సూచనలు వారి ఆశలను గల్లంతు చేశాయి.