ఎన్డీయే సమావేశానికి శివసేన గైర్హాజర్

  • Published By: madhu ,Published On : November 16, 2019 / 03:43 PM IST
ఎన్డీయే సమావేశానికి శివసేన గైర్హాజర్

Updated On : November 16, 2019 / 3:43 PM IST

ఎన్డీయే సమావేశానికి హాజరు కావొద్దని శివసేన నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం ఎన్డీయే కీలక సమావేశం నిర్వహించబోతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే..ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన గైర్హాజరు కానుంది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో శనివారంనాడు సమావేశమైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌డీఏ సమావేశానికి తమ పార్టీ హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధనమిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, అంతా సజావుగానే సాగుతోందని చెప్పారు. ఇంతకు ముందు సైతం రౌత్ తన ఆరోగ్యం కారణంగా ఎన్డీయే సమావేశానికి హాజరుకావడం లేదని మీడియాకు తెలిపారు. అయితే 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు మాత్రం ఆయన హాజరవుతారు.
Read More : ఐదుగురు ఉగ్రవాద అనుమానితులు అరెస్టు