మహారాష్ట్ర రాజకీయాలు గంటకు ఓ రకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పరిణామాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఫలితాల తర్వాత అధికారం చేపట్టిన శివసేన 50-50 ఫార్ములాను ఎన్నికలకు ముందే మాట్లాడుకున్నామని అంటుంది.
ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీకి శివసేన చుక్కలు చూపిస్తోంది. రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని చెబుతుంది.
అంతేకాదు బీజేపీ అధినేత అమిత్ షా ఈ మేరకు హామీ పత్రం రాసివ్వాలని కూడా కోరుతుంది శివసేన. ఈ క్రమంలోనే దేవేంద్ర ఫడ్నవిస్ ఎట్టకేలకు పెదవి విప్పారు. మరో ఐదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ వెల్లడించారు. బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో పాలన అందిస్తుందంటూ వెల్లడించాడు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 స్థానాలు కైవసం చేసుకోగా.. శివసేన 56 సీట్లు దక్కించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.