Shiv Sena :అరె ఏందయ్యా ఇది..!మూడేళ్లైనా మాస్క్ ఎట్టా పెట్టుకోవాలో తెలియట్లేదే శివసేన కార్యకర్తలకు పాపం..

క్కడనే ఉన్న ఇతర నేతలు ఆయన ప్రసంగానికి చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఫేస్ మాస్క్ ధరించాలని ఓ వ్యక్తి ప్రయత్నించడం విఫలం అవుతూ వచ్చాడు...

Shiv Sena Worker Struggles To Wear Face Mask : కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఇప్పటికీ మాస్క్ లు ధరిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ తో పాటు మాస్క్ లు కంపల్సరీగా వేసుకుంటున్నారు. మాస్క్ లు వివిధ రకాలుగా ఉంటున్నాయనే సంగతి తెలిసిందే. అయితే మాస్క్ ఎలా వేసుకోవాలో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు సైతం మాస్క్ వేసుకోవడం నేర్చుకున్నారు. కానీ ఓ శివసేన కార్యకర్తకు మాత్రం మాస్క్ ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో తెగ నవ్విస్తోంది. గోరఖ్ పూర్ లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతోంది.

Read More : UP Assembly Election 2022 : యూపీలో నాలుగో విడత.. 57.45 శాతం పోలింగ్ నమోదు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొందనే సంగతి తెలిసిందే. ఏడు దశల్లో ఇక్కడ పోలింగ్ జరుగనుంది. ఇప్పటికీ నాలుగు దశల్లో పోలింగ్ కంప్లీట్ అయ్యింది. ఐదో దశ ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం జరుగనుంది. ఈ క్రమంలో పలు పార్టీలు ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శివసేన కూడా బహిరంగసభలు ఏర్పాటు చేస్తోంది. ఓ బహిరంగ సభలో శివసేన ఎంపీ ధైర్య శిల్ ప్రసంగిస్తున్నారు. అక్కడనే ఉన్న ఇతర నేతలు ఆయన ప్రసంగానికి చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఫేస్ మాస్క్ ధరించాలని ఓ వ్యక్తి ప్రయత్నించడం విఫలం అవుతూ వచ్చాడు. దాని అటూ తిప్పుతూ.. ఇటు తిప్పుతూ.. ముఖానికి వేసుకోవడానికి యత్నించాడు.

Read More : UP Assembly Election 2022 : ‘తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం’ : ప్రిన్సిపల్

కానీ.. ఎలా ధరించాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. నెటిజన్లు వివిధ కామెంట్స్ చేస్తున్నారు. చివరకు పక్కనే ఉన్న ఓ నేతను సహాయం కోరాడు. అతను చెప్పిన విధంగా చేసి ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. కరోనా అంటే ఇలా ఉంటుంది.. భాయ్ క్యా కర్ రహా హై తు..అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మాస్క్ ధరించడానికి డ్యూడ్ కి రెండు నిమిషాల టైం పట్టిందంటూ మరొకరు సెటైర్ వేశారు. 2022, ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం ఐదో దశ పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదో దశ పోలింగ్ లో ఉన్నాయి. మార్చి 03, మార్చి 07 తేదీల్లో మిగతా పోలింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు