UP Assembly Election 2022 : ‘తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం’ : ప్రిన్సిపల్

తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం అని యూపీలోని ఓ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్ధులకు ఆఫర్ ఇచ్చారు.

UP Assembly Election 2022 : ‘తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం’ : ప్రిన్సిపల్

Up Assembly Elec 22

UP Assembly Election 2022 : ఉత్తరప్రదేశల్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడత కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో యూపీలో ఓ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విద్యార్ధుల తల్లిదండ్రులో తమ ఓటుహక్కును వినియోగించుకుంటే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తామని ప్రకటించారు.

లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజీ ప్రిన్సిపల్ తమ విద్యార్ధులకు ఇటువంటి వినూత్న ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేసిన విద్యార్థులకు 10 మార్కులను బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు ప్రిన్సిపల్ రాకేష్ కుమార్. ఈ వినూత్న ఆఫర్ గురించి ప్రిన్సిలప్ రాకేష్ కుమార్ మాట్లాడుతు..యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగు శాతాన్ని పెంచటానికి విద్యార్థులకు ఇటువంటి ఆఫర్ ఇచ్చామని తెలిపారు.

అలాగే ఓటర్ల సంఖ్యను పెంచడంతోపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడే విద్యార్థులకు ఈ విధంగా సహాయం చేయటానికి ఇటువంటి ఆఫర్ ప్రకటించామని లక్నోలోని క్రైస్ట్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ రాకేష్ కుమార్ వెల్లడించారు. కాలేజ్ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఈ ఆఫర్తో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఓటు వేసేలా ప్రోత్సహిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ఈ ఆఫర్ వెనుక రాజకీయ హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

 

కాగా..ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో దశకు చేరుకున్నాయి. ఈరోజు(23 ఫిబ్రవరి 2022) తొమ్మిది జిల్లాల్లోని 59 స్థానాల్లో ఓటింగ్ జరగుతోంది. నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.