Shivling Missing : మహాశివరాత్రికి ముందు కలకలం.. ఆలయంలో శివలింగం మాయం.. రంగంలోకి గత ఈతగాళ్లు, డైవర్లు.. సముద్రంలో సెర్చ్ ఆపరేషన్

ఈ శివాలయం చాలా పురాతనమైనది. వందల ఏళ్ల క్రితం నాటిది. ఈ ఆలయానికి, అందులోని శివలింగానికి ఎంతో ప్రాశ్యస్తం ఉంది.

Shivling Missing : సరిగ్గా మహాశివరాత్రికి ముందు రోజున గుజరాత్ రాష్ట్రంలోని ఓ శివాలయంలో కలకలం రేగింది. ఆలయం నుంచి శివలింగం మాయమైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. శివలింగం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో పాటు డైవర్లను రంగంలోకి దిగారు. సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు.

గుజరాత్ రాష్ట్రం దేవభూమి ద్వారక జిల్లాలో శ్రీ బద్ బంజన్ భావనీశ్వర్ మహదేవ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఆలయం హర్షద్ బీచ్ కి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ గుడిలో ఉన్న శివలింగానికి ఎంతో ప్రాశ్యస్తం ఉన్నట్లు చెబుతారు. ఎంతో మహిమాన్వితమైనది కూడా అంటారు.

సరిగ్గా మహాశివరాత్రికి ముందు రోజు.. అనగా.. ఫిబ్రవరి 25వ తేదీన ఉదయాన ఆలయానికి వెళ్లి చూసిన పూజారి షాక్ కి గురయ్యాడు. అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ ప్రదేశం నుండి వేరు చేయబడి ఉంది. దీంతో ఆయన నోట మాట పడిపోయింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. శివలింగం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శివలింగాన్ని ఆలయం నుంచి పెకలించి వేసి.. సమీపంలోనే ఉన్న సముద్రంలోకి పడేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : బంగారం ధరలు భారీగా పెరుగుతుంటే.. ఇక్కడ మాత్రం పసిడి ధర తక్కువ గురూ.. కొనేస్తారా?

ఈ క్రమంలో పోలీసులు గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్లను రంగంలోకి దించారు. వారు సముద్రంలోకి వెళ్లి శివలింగం కోసం గాలిస్తున్నారు. అటు.. లోకల్ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ పోలీసులు, రెగులర్ పోలీసులు, డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. మాయమైన శివలింగం కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శివలింగం బేస్ ఆలయానికి కాస్త దూరంలో కనిపించింది.

చోరీకి గురైన శివలింగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పోలీసు సూపరింటెండెంట్ నితీష్ పాండే తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాలు, సమీపంలోని సముద్రాన్ని జల్లెడ్ పట్టేందుకు పరిశోధకుల బృందాలు, స్కూబా డైవర్లు, గజ ఈతగాళ్లను రంగంలోకి దించామన్నారు. దొంగలు శివలింగాన్ని నీటి అడుగున దాచి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఆలయంలోని శివలింగం చోరీకి గురైందని ఆలయ పూజారి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, దర్యాఫ్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. శివలింగాన్ని సముద్రం అడుగు భాగంలో దాచి ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆ అనుమానంతోనే గజ ఈతగాళ్లను, నిపుణులైన స్కూబా డైవర్లను పిలిపించి సముద్రాన్ని జల్లెడ పడుతున్నామన్నారు.

శివలింగం చోరీకి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 380 కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదైందని, సమగ్ర శోధన ఆపరేషన్ జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Also Read : బంగారం మరో నాలుగు నెలల తర్వాత అక్కడ తగ్గుతుందా? 50 ఏళ్ల నుంచి ట్రెండ్‌ ఇలాగే ఉంది మరి..

”నేను ఆలయానికి వచ్చి చూడగా.. గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. దాంతో కంగారు పడ్డాను. లోపలికి వెళ్లి చూడగా మరింత షాక్ కి గురయ్యాను. శివలింగం దాని పవిత్ర స్థలంలో కనిపించ లేదు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను” అని ఆలయ పూజారి తెలిపారు. కాగా, ఈ శివాలయం చాలా పురాతనమైనది. వందల ఏళ్ల క్రితం నాటిది. ఈ ఆలయానికి, అందులోని శివలింగానికి ఎంతో ప్రాశ్యస్తం ఉంది.