Gold: బంగారం ధరలు భారీగా పెరుగుతుంటే.. ఇక్కడ మాత్రం పసిడి ధర తక్కువ గురూ.. కొనేస్తారా?

బంగారు ఆభరణాలంటే భారతీయులకు చాలా ఇష్టం.

Gold: బంగారం ధరలు భారీగా పెరుగుతుంటే.. ఇక్కడ మాత్రం పసిడి ధర తక్కువ గురూ.. కొనేస్తారా?

Updated On : February 26, 2025 / 4:15 PM IST

బంగారంపై విధించే ట్యాక్స్‌తో పాటు దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను తక్కువగా ఉండడం.. అలాగే, పసిడి అమ్మే మార్కెట్లు ఎక్కువగా ఉండడం వంటి అంశాల వల్ల కొన్ని దేశాల్లో స్వర్ణం ఇండియాలో కంటే తక్కువ ధరకు దొరుకుతుంది. కాబట్టి బంగారం ఎక్కువ మొత్తంలో కొనాలనుకునే భారతీయులకు ఏయే దేశాలలో తక్కువ ధరకు దొరుకుతుందో తెలుసుకోవాల్సిందే..

దుబాయ్: ఇక్కడ ఉన్న ‘గోల్డ్ సౌక్’ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు మార్కెట్. ఇక్కడ ఎలాంటి ట్యాక్స్ లేకుండా బంగారం, ఆభరణాలు, విలువైన రత్నాలను కూడా కొనవచ్చు. ఈ మార్కెట్ లో ఉన్న కొన్ని షాపులు కొన్ని షరతులతో EMIలో కూడా బంగారాన్ని కొనడానికి అవకాశం ఇస్తాయి. ‘గోల్డ్ సౌక్’ మార్కెట్ దుబాయ్ నడిబొడ్డున ఉండడం వలన చాలా మంది పర్యాటకులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగారం కొని వారి స్వదేశానికి తీసుకెళ్తారు.

ఇక్కడ మనం ఒకేసారి కిలోల కొద్దీ బంగారం కొనాలనే రూల్ ఈమె లేదు. తక్కువలో తక్కువ ఒక గ్రాము బంగారంతో షాపింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఎవరైనా ఈ మార్కెట్ లో బంగారంపై పెట్టుబడి పెట్టలనుకునే వారు కూడా డీమ్యాట్ అకౌంట్ ద్వారా అక్కడ ఉన్న మధ్యవర్తుల సాయంతో పెట్టవచ్చు. అలాగే గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇక్కడ కొనుగోలు చేసే బంగారంలో స్వచ్ఛత, నాణ్యమైన విషయంలో ఎలాంటి అనుమానంలేకపోవడమే కాకుండా ఆభరణాల డిజైన్లు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉంటాయని అనడంలో అతిశయోక్తి లేదు.

Also Read: ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హాంకాంగ్: పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన ప్రత్యేక పరిపాలనా ప్రాంతమైన హాంకాంగ్‌లో తక్కువ ట్యాక్స్ రేట్లు, బంగారం మార్కెట్లో పోటీ కారణంగా పసిడిని మనం కొంచెం తక్కువ ధరలో కొనవచ్చు. ఇప్పుడు ఇండియాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.87,820 వద్ద ఉండగా అక్కడ దాదాపుగా రూ.81,000 నుంచి రూ.82,000 మధ్య ఉంది. ఈ గణన ప్రకారం, మన దేశంలోని బంగారం ధరతో పోలిస్తే అక్కడ బంగారం ధర సుమారు 5 వేల నుంచి 6 వేల రూపాయలు వరకు తక్కువగా ఉంది.

స్విట్జర్లాండ్: ఉండడానికి ఖరీదైన దేశమే కానీ బంగారం విషయములో మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం విధించిన తక్కువ VAT కారణంగా స్విట్జర్లాండ్ లో బంగారం కొంతమేరకు తక్కువ ధరకు లభించడం వల్ల ప్రపంచంలో తక్కువ ధరకే బంగారం దొరికే దేశాల్లో ఈ దేశం ఒకటిగా ఉంది.

థాయ్‌లాండ్: ఈ దేశపు రాజధాని అయిన ‘బ్యాంకాక్’కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఇతర దేశాల నుంచి సేదతీరడానికి వచ్చే పర్యాటకులతో కిటకిటలాడే అందమైన నగరమం ఇది. ఇక్కడ పెద్ద మొత్తంలో బంగారం పై బెస్ట్ డిస్కౌంట్స్ ఇవ్వడం వలన ‘బ్యాంకాక్’ లో బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. అలాగే ఇక్కడ ఆభరణాలు చేసే వారి సంఖ్య చాల ఎక్కువగా ఉండడం వలన బంగారం ధరలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా బంగారం పై పెట్టుబడి లాంటి వ్యాపారాలు చాల పెద్ద మొత్తంలో జరుగుతాయి.

దక్షిణాఫ్రికా: ఈ దేశంలో అధికంగా బంగారం ఉత్పత్తి అవ్వడం వల్ల, డైరెక్ట్ గా వ్యాపారులు గనుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలతో పోలిస్తే, దక్షిణాఫ్రికాలో బంగారం కొనుగోలుపై పన్నులు లేదా ఇతర సుంకాలు తక్కువగా ఉండటం వలన బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.