ECIL Recruitment: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?
ఉద్యోగాల కోసం చూస్తున్నారా? ఈసీఐఎల్‌లో ట్రై చేయండి.

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు ఉద్యోగాల భర్తీ కోసం అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తుదారులు స్వీకరిస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
ఇందులో అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌తో పాటు సీనియర్ ఆర్టీసన్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 17 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు మార్చి 5.
అర్హతలు
- గ్రేడ్ 2 కేటగిరిలోని 7 ఉద్యోగాలకు ఈసీఈ, ఈఈఈ, ఈఐ ఉత్తీర్ణత
- గ్రేడ్ 2 కేటగిరిలోని ఒక పోస్టుకు మెకానికల్ విభాగంలో డిగ్రీ
- రెండు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఈసీఈ, ఈఈఈ, ఈఐ ఉత్తీర్ణత
- ఆరు సీనియర్ ఆర్టిసియన్ ఉద్యోగాలకు ఫిట్టర్/టన్నెల్/డిజిల్ మెకానిక్ లో ఉత్తీర్ణత, అనుభవం
జీతం: అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ రూ.45,000- రూ.60,000 మధ్య, సీనియర్ ఆర్టీసన్‌కు రూ. 22, 718
వయసు: 30 ఏళ్లు దాటొచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు..
దరఖాస్తు: ఈసీఐల్ హైదరాబాద్ వెబ్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. అందులోని అడ్రస్‌కు బయోడేటా, అటెస్టేషన్‌తో సర్టిఫికెట్స్ పంపండి
అడ్రస్: ఈసీఐఎల్ రీజినల్ ఆఫీస్.. డోర్ నెం.47-09-28/10, ద్వారకా నగర్, విశాఖ.
ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: https://www.ecil.co.in/jobs/Application_Form_Updated.pdf