క్రిస్మస్ జరుపుకున్న అమీర్ ఖాన్..నెటిజన్ల మండిపాటు..స్ట్రాంగ్ రిప్లై

  • Published By: madhu ,Published On : December 26, 2019 / 02:35 PM IST
క్రిస్మస్ జరుపుకున్న అమీర్ ఖాన్..నెటిజన్ల మండిపాటు..స్ట్రాంగ్ రిప్లై

Updated On : December 26, 2019 / 2:35 PM IST

అమీర్ ఖాన్ క్రిస్మస్ పండుగ జరుపుకోవడం ఏంటీ ? దీనిని నెటిజన్లు మండిపడడం ఎ ఎందుకు ? ఎలాంటి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. అనేగా మీ డౌట్. కానీ అమీర్ ఖాన్ అనగానే బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గుర్తుకు వస్తాడు కదా.. కానీ ఆయన కాదు. ఇతను బ్రిటీష్ బాక్సర్. ఇతని పేరు కూడా అమీర్ ఖాన్. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా అమీర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.

 

కుటుంబసభ్యులతో ఆనందంగా క్రిస్మస్ పండుగ జరుపుకున్నా..అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఇద్దరు పిల్లలు, భార్యతో అమీర్ ఖాన్ ఫొటో దిగారు. అందరూ ఒకే డ్రెస్ ధరించి ఉన్నారు. అయితే..నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేశారు. ముస్లిం అయి ఉండి..క్రైస్తవుల పండుగను ఎలా జరుపుకుంటారు అంటూ ప్రశ్నించారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

కామెంట్స్ ఆశ్చర్యం కలిగించాయి..మతం అనే బేషజాలు లేని ఓ వ్యక్తిగా నేను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపుతూ..వేడుకులు జరుపుకోవడం జరిగిందన్నారు. అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అందరినీ మనస్పూర్తిగా ధ్వేషిస్తున్నా..అంటూ రీ ట్వీట్ చేశారు. 

Read More : విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం

ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే..బ్రిటీష్ బాక్సర్ గా పేరొందారు. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ లో పాల్గొన్న ఈ బాక్సర్ సిల్వర్ మెడల్ సాధించారు. 2020 టోక్యోలో జరిగే..ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా ఉన్నాడు. కానీ..కొంతకాలంగా గాయాలతో బాధ పడుతుండడంతో రింగ్ లోకి దిగలేదు. ఏప్రిల్ నుంచి పోటీలకు దిగుతానని ఇటీవలే వెల్లడించాడు అమీర్ ఖాన్.