Viral Video : బాబోయ్.. అది ఇల్లా? పాముల పుట్టా? ఆ ఇంట్లో 60 సర్పాలు, షాకింగ్ వీడియో

60 Snakes In House : కంగారుపడ్డ ఇంటి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు సిబ్బందితో రంగంలోకి దిగారు. పాములన్నింటిని పట్టుకున్నారు.

Snakes In House (Photo : Google)

60 Snakes In House : ఒక పాముని చూస్తేనే ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. కాళ్లు చేతులు వణుకుతాయి. వెన్నులో వణుకు పడుతుంది. అలాంటిది పదుల సంఖ్యలో పాములు కనిపిస్తే.. వామ్మో ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైనే పోతాయి కదూ. బీహార్ లోని రోహ్తాస్ లో ఒక ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు ఉంది. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని గుర్తించాడు ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి కొన్నింటిని కొట్టి చంపేశాడు. అయినా ఇంకా పాములు బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో కంగారుపడ్డ ఇంటి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు సిబ్బందితో రంగంలోకి దిగారు. పాములన్నింటిని పట్టుకున్నారు. వాటిని ఊరికి దూరంగా అడవిలో వదులుతామన్నారు.

Also Read..Viral Video : ఆడపిల్లల బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు..! స్కూల్ ప్రిన్సిపాల్‌‌ను పిచ్చకొట్టుడు కొట్టారు, వీడియో వైరల్

అధికారులు పాములను పట్టుకుని ఓ పెద్ద డబ్బాలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో.. ఇన్ని పాములా? అని నెటిజన్లు నివ్వెరపోతున్నారు. అది ఇల్లా? పాముల పుట్టా? అని నోరెళ్లబెడుతున్నారు. కాగా, అవన్నీ విషపూరితమైనవే అని తెలియడంతో ఇంటి యజమాని సహా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

”సుమారు 30 పాములను పట్టుకున్నాం. సర్పాలు ఇంటి గోడలో తలదాచుకున్నాయి. గోడను పగులకొట్టి పాములను బయటకుతీశాము. వాటిని అటవీ ప్రాంతంలో వదిలేశాము” అని అటవీశాఖ అధికారి తెలిపారు.

Also Read..Viral Video : దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై షార్ట్ విప్పేసి యువతిపై అత్యాచారయత్నం.. షాకింగ్ వీడియో

”మా ఇల్లు 1955లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాము. ఇది రెండంతస్తుల భవనం. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన జరిగింది లేదు. ఇంతవరకు పాములు కనిపించలేదు. కానీ, ఏకంగా 60 సర్పాలు బయటపడటం ఇదే తొలిసారి” అని ఇంటి యజమాని చెప్పారు. ఈ ఘటనతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు.