Siddaramaiah
Siddaramaiah : కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్‌కెరె ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. ఎవరైనా అయోధ్యలోని రామమందిరానికి వెళ్లి రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు. జనవరి 22వతేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సిద్ధరామయ్యను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా ఆంజనేయ చిత్రదుర్గలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ALSO READ : Puri’s Jagannath temple : పూరి జగన్నాథ్ దేవాలయంలో డ్రెస్ కోడ్…షార్ట్స్, జీన్స్‌పై నిషేధాస్త్రం
‘‘ సీఎం సిద్దరామయ్య స్వయంగా రాముడు. అలాంటప్పుడు ఆ రాముడిని అయోధ్య గుడిలో ఎందుకు పూజించాలి? అది బీజేపీకి చెందిన రాముడు. బీజేపీ పబ్లిసిటీ కోసం ఇది చేస్తుంది. వారు చేయనివ్వండి’’ అని ఆంజనేయ కన్నడలో అన్నారు. మా రాముడు మన హృదయంలో ఉన్నాడని, తన పేరు ఆంజనేయుడని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ఆంజనేయ వ్యాఖ్యపై బీజేపీ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు.
ALSO READ : Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం…ఆరుగురి మృతి
‘‘ఇలాంటి మూర్ఖులు, బంధుప్రీతిదారులు, హిందూ వ్యతిరేకులు గతంలో రాష్ట్రానికి మంత్రులుగా ఉండడం కర్ణాటక రాష్ట్ర దౌర్భాగ్యమని, ఆరాధ్యదైవం సిద్ధరామయ్యకు పూజలు చేయనివ్వండి’’ అని బసనగౌడ పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపనకు సంబంధించి తనకు ఆహ్వానం అందలేదని సిద్ధరామయ్య అన్నారు. కాగా తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానం వస్తే పరిశీలిస్తానని సిద్ధరామయ్య చెప్పారు.