Karntaka Politics: అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తా అని సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం

1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్‌ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు

Karntaka Politics: అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తా అని సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం

Updated On : July 13, 2023 / 9:44 PM IST

Assembly Session: సర్దుబాటు రాజకీయాలు తనకు తెలియవని, ఒకవేళ అలాంటి రాజకీయాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం శాసనసభలో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం చర్చలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యలకు పై విధంగా కౌంటర్ ఇచ్చారు.

Karnataka: టూషన్‭కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసే యత్నం.. పెళ్లి కాకపోతే మరీ ఇలా ప్రవర్తించాలా?

జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్దుబాటు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాగా, కుమారస్వామి ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న సిద్దరామయ్య.. సర్దుబాటు రాజకీయాలు తనకు ఏమాత్రం గిట్టవని స్పష్టం చేశారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రులు, మంత్రుల ఇళ్లకు వెళ్లలేదని స్పష్టం అన్నారు.

Pawan Kalyan : జగ్గు భాయ్‌ని ఎలా కంట్రోల్ చేయాలో జనసేనకు బాగా తెలుసు- పవన్ కల్యాణ్

1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్‌ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు. అంతకు ముందు కుమారస్వామి ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఐదు గ్యారెంటీ పథకాలు అవకతవకలుగా సాగుతున్నాయని విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కుమారస్వామి విమర్శలు గుప్పించారు.