Single-Dose Sputnik V Light : త్వరలో భారత్‌కు సింగిల్ డోస్ స్పుత్నిక్‌-వి లైట్‌ టీకా

దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి లైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Single Dose Sputnik V Light

Single-Dose Sputnik V Light : కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు ఇవ్వాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే కరోనాను కట్టడి చేయగలం అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీల టీకాలు భారత్ లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరికొన్ని కంపెనీల టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రష్యా టీకాపై ఫోకస్ పెట్టింది.

దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి లైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని రష్యా తయారీ సంస్థ, భారత్‌లోని భాగస్వామ్య కంపెనీలతో సహా నియంత్రణ సంస్థ అధికారులను ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లో ఈ టీకా అనుమతుల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అనుమతులు మంజూరైతే.. దేశంలో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్‌ డోస్‌ టీకా స్పుత్నిక్‌-వి లైట్‌ కానుంది.