అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో ఆరుగురు ఉగ్రవాదుల హతం

అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో ఉన్న వెస్ట్ కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తిరుగుబాటు సంస్థ నేషనల్ లిబరేషన్

అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో ఆరుగురు ఉగ్రవాదుల హతం

Six Militants Killed On Assam Nagaland Border

Updated On : May 23, 2021 / 2:04 PM IST

అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో ఉన్న వెస్ట్ కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తిరుగుబాటు సంస్థ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్‌ఎల్‌ఎ) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల వద్ద నుంచి నాలుగు ఎకె -47 రైఫిల్స్‌తో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా డిఎన్‌ఎల్‌ఎ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ కోనసాగిస్తున్నారు.