Onions Smelly In Flight : ఎయిరిండియా విమానంలో ఉల్లిపాయల వాసన, హడలిపోయిన ప్రయాణీకులు.. ఎమర్జన్సీ ల్యాండ్ చేసిన పైలట్

కేరలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు ఎయిర్ ఇండియా విమానంలో ఉల్లిపాయల వాసనకు ప్రయాణీకులంతా హడలిపోయారు. గందరగోళం సృష్టించారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కొచ్చికి తిరిగి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు.

Onions Smelly In Flight : ఎయిరిండియా విమానంలో ఉల్లిపాయల వాసన, హడలిపోయిన ప్రయాణీకులు.. ఎమర్జన్సీ ల్యాండ్ చేసిన పైలట్

Onions Smelly In Air India Flight

Onions Smelly In Air India Flight : కేరలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు ఎయిర్ ఇండియా విమానంలో ఉల్లిపాయల వాసనకు ప్రయాణీకులంతా హడలిపోయారు. తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. విమానం గాల్లో ఉండగానే గందరగోళం సృష్టించారు. దీంతో పైలట్ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని తిరిగి కొచ్చికి తిరిగి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. ఇంతకీ ఉల్లిపాయల వాసనకే ప్రయాణీకులు ఎందుకు అంతగా హడలిపోయారు అనే విషయం గందరగోళంగా మారింది. అసలు విషయం ఏంటంటే..

ఆగస్టు 2(2023) ఐఎక్స్-411 అనే నెంబరు గల ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం 175 మంది ప్రయాణికులతో కొచ్చి నుంచి షార్జా బయల్దేరింది. ఈక్రమంలో విమానంలో ఘాటైన వాసన వస్తోంది అంటూ కొంతమంది ప్రయాణీకులు విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది ఆ వాసన ఎక్కడనుంచి వస్తుందోనని పరిశీలించారు. కానీ తెలియలేదు. కానీ ఘాటైన వాసన మాత్రం వస్తోంది. దీంతో విమాన సిబ్బందిలోనూ, ప్రయాణికుల్లోనూ అయోమయం నెలకొంది.

Nuh Violence : నుహ్ అల్లర్ల ఎఫెక్ట్..ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు

ఏదో మండుతున్నట్లుగా వాసన రావటంతో కొంతమంది ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గందరగోళం సృష్టించారు. దీంతో పైలట్ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని పైలెట్ వెనక్కి మళ్లించి తిరిగి కొచ్చిన్ కు తిరగుముఖం పట్టారు. దీంతో ఏదో పెద్ద కారణం ఉంటేనే గానీ విమానాన్ని వెనక్కి మళ్లించని ప్రయాణీకుల్లో కలకలం రేగింది.విమాన సిబ్బంది ఎవ్వరు ఆందోళన చెందవద్దని సూచించినా వారి భయం తగ్గలేదు.

ఈలోగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగొచ్చిన ఆ విమానం ల్యాండవగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరవాత ఆ వాసన ఎక్కడనుంచి వస్తోంది అనే విషయంపై మొత్తం పరిశీలించారు. విమానంలో ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా..చివరకు విమానంలోని సరకు రవాణా కంటెయినర్ లో ఉన్న ఓ ఉల్లిపాయలు, కూరగాయల పెట్టె నుంచి ఆ వాసన వస్తున్నట్టు గుర్తించారు.కానీ అదేదో మండుతున్న వాసన అనుకుని నానా గందరగోళం జరగటం..విమానం తిరిగి రావటం జరిగింది.

Gyanvapi Survey Breaking: జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. విమానం ఉదయం 5.14 గంటలకు బయలుదేరిన మరొక విమానంలో అతిథుల కోసం ఏర్పాట్లు చేసింది.