ఎయిర్‌పోర్టులో కలకలం : భారీగా పాములు పట్టివేత

చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. భారీగా పాములు, బల్లులు, కప్పలు పట్టుబడ్డాయి. మహ్మద్ అనే విద్యార్థి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 04:00 AM IST
ఎయిర్‌పోర్టులో కలకలం : భారీగా పాములు పట్టివేత

Updated On : March 26, 2019 / 4:00 AM IST

చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. భారీగా పాములు, బల్లులు, కప్పలు పట్టుబడ్డాయి. మహ్మద్ అనే విద్యార్థి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్

చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. భారీగా పాములు, బల్లులు, కప్పలు పట్టుబడ్డాయి. మహ్మద్ అనే విద్యార్థి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎయిర్ పోర్టు అధికారులు అతడిని తనిఖీ చేయగా పాములు, బల్లులు, కప్పలు కనిపించి షాక్ తిన్నారు. వీటన్నింటిని అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎక్కడికి తరలిస్తున్నాడు అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఇవన్నీ అరుదైన జీవరాశులు అని అధికారులు చెప్పారు.

మహ్మద్ థాయ్ ఎయిర్ వేస్ లో చెన్నై ఎయిర్ పోర్టుకి వచ్చాడు. లగేజీతో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. డౌట్ వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడిని చెక్ చేశారు. అందులో కనిపించిన వాటిని చూసి విస్తుపోయారు. అతడి బ్యాగ్ లో అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లు, అరుదైన రకం పాములు, ఉడుములు, కప్పలు ఉన్నాయి.  వీటన్నింటిని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తీసుకొచ్చాడు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. వన్యప్రాణుల అక్రమరవాణ నేరం. ఈ సెక్షన్ కింద మహ్మద్ పై కేసు నమోదు చేశారు. కస్టమ్స్ అధికారుల సమాచారంతో జూ అధికారులు రంగంలోకి దిగారు. పట్టుబడిన జీవరాశులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్నీ ఆరోగ్యంగా ఉన్నట్టు వారు చెప్పారు. అక్రమంగా తీసుకొచ్చిన వాటిలో విషపూరితమైన ఆఫ్రికన్ పాముని గుర్తించారు.