Sonam Kapoor: సోనమ్ కపూర్ ఇంట్లో రూ.2.4కోట్ల నగలు లూటీ చేసిన దొంగలు
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం గురించి పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని ఆనంద్ అహుజా నివాసంలో ఈ ఘటన జరిగిందని..

Sonam Kapopor
Sonam Kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం గురించి పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని ఆనంద్ అహుజా నివాసంలో ఈ ఘటన జరిగిందని రూ.2.4కోట్లు విలువైన నగలు చోరీ చేశారని.. తెలిపారు. ఘటన జరిగిన రెండు వారాలకు అంటే ఫిబ్రవరి 11న దొంగతనం జరగ్గా ఫిబ్రవరి 23న కంప్లైంట్ వచ్చిందని స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.
మార్చి మూడో వారంలో సోషల్ మీడియా వేదికగా మూడు నెలల ప్రెగ్నెంట్ అని ప్రకటించింది సోనమ్ కపూర్. అంటే ఆ ఘటన జరగడానికి ముందే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు తెలుస్తుంది. ఘటన జరిగిన సమయంలో అదే ఇంట్లో సోనమ్ ఉన్నారా అనే సమాచారం లేదు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
‘ఫిబ్రవరి 23 వ తేదీ దొంగతనం జరిగింది. కొంత డబ్బుతో పాటు రూ.2.4కోట్ల విలువైన నగలు పోయినట్లుగా కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 11నే తెలిసినా 23వ తేదీ కంప్లైట్ చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దొరికిన సాక్ష్యాలను బట్టి టీంలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం’ అని పోలీసులు ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పారు.
Read Also: RSS చీఫ్ పై హీరోయిన్ సోనమ్ కపూర్ ఫైర్
కొద్ది కాలం గ్యాప్‌లోనే సోనమ్ కపూర్‌కు ఇది రెండో చేదు విషయం. మార్చి నెలలో సోనమ్ కపూర్ మామ సైబర్ మోసంలో రూ.27కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.