×
Ad

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నుంచి సోనియా గాంధీ పోటీ.. షాక్‌ అవుతున్నారా? ఈ సోనియా గాంధీ ఎవరంటే?

అనూహ్య అభ్యర్థిని పోటీలోకి దింపింది బీజేపీ.  

Sonia Gandhi in Munnar

Sonia Gandhi in Munnar: కేరళలో కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టేలా సోనియా గాంధీ అనే మహిళను బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దింపింది. ఇడుక్కి జిల్లా మున్నార్ గ్రామపంచాయతీ నల్లతన్ని వార్డులో సోనియా గాంధీ అనే మహిళ బీజేపీ తరఫున పోటీ చేస్తోంది.

కాంగ్రెస్‌కు వీరాభిమాని అయిన దురై రాజ్ అనే వ్యక్తి తన ఇష్ట నాయకురాలు సోనియా గాంధీ పేరును తన కుమార్తెకు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీని అభిమానించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సోనియా గాంధీకి బీజేపీ మున్నార్ పంచాయతీ జనరల్ సెక్రటరీ సుబాష్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత సోనియా గాంధీ బీజేపీలో చేరి అక్కడి అభ్యర్థిగా పోటీ చేస్తోంది.

పుతిన్‌ సీక్రెట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ గురించి తెలుసా? ఆహారాన్ని టెస్ట్ చేయించే తింటారు.. ఎలాగంటే? షాకింగ్‌ డీటెయిల్స్‌

తమిళుల ఆధిక్యం మున్నార్ ప్రాంతంలో ప్రముఖ నాయకుల పేర్లు పెట్టడం సాధారణం. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, మొహందాస్ కరంచంద్ గాంధీ, కస్తూర్బా గాంధీ, ఇందిరా ప్రియదర్శిని, రాహుల్, సంజయ్ గాంధీ, లెనిన్, స్టాలిన్ వంటి పేర్లను అక్కడ సాధారణంగానే పిల్లలకు పెట్టుకుంటారు.

సోనియా గాంధీ పేరు ఉన్న మహిళ బీజేపీ తరఫున పోటీకి దిగడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతంలో సోనియా గాంధీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల ఇప్పుడు అసాధారణ సవాల్ ఎదుర్కొంటోంది. ఎందుకంటే సోనియా పేరు బలంగా ప్రజల్లోకి వెళుతోంది. కాంగ్రెస్‌ ఓటర్లు కూడా సోనియాకే ఓటు వేస్తారన్న భయం మంజులకు పట్టుకుంది. ఒకే పేర్లు పెట్టుకున్న వారు ఓటర్లలో గందరగోళం సృష్టించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.