పుతిన్ సీక్రెట్ ఫుడ్ ల్యాబ్ గురించి తెలుసా? ఆహారాన్ని టెస్ట్ చేయించే తింటారు.. ఎలాగంటే? షాకింగ్ డీటెయిల్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5న భారత్‌లో పర్యటిస్తారు.
Putin
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనగానే చాలా మందికి ముందుగా ఆయన ఫిట్‌నెసే గుర్తుకు వస్తుంది. 73 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుకుగా ఉంటారు. ఇంతగా యాక్టివ్‌గా ఉండాలంటే తినే ఆహారంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. పుతిన్‌కు సంప్రదాయ, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారమంటే ఇష్టం.
అలాగే, విదేశీ పర్యటనల్లో ఎలాంటి హానీ కలగకుండా ఆయన తినే ఆహారాన్ని సిబ్బంది ముందుగానే పరీక్షిస్తారు. పుతిన్ తినే ఆహారంలో విషపదార్థాలు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసే ప్రత్యేక ఫుడ్ ల్యాబ్ (ప్రయోగశాల)ను ఆయన ప్రయాణాల్లో వెంట తీసుకెళ్తారన్న మాట. (Vladimir Putin)
పుతిన్ కోసం సిద్ధం చేసే భోజనాన్ని ఫుడ్ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. భద్రత కోసం రష్యా అధ్యక్షుడి ఆహారాన్ని రోజూ ఈ ల్యాబ్ చెక్ చేస్తుంది. ఇలా పుతిన్ భోజనంలో విషం ఉందో, లేదో పరీక్షించే మొబైల్ ల్యాబ్ కూడా ఆయన పర్యటనలో భాగంగా ఉంటుంది.
విదేశీ పర్యటన సమయంలో పుతిన్ ఆహార పదార్థాలు, డ్రింక్స్ వంటి వాటిని రష్యా నుంచే తీసుకొస్తారు. వండానికి ప్రత్యేకంగా వంటవాళ్లు, హోటల్ సిబ్బంది కూడా అక్కడి నుంచే వస్తారు. ఆయన విదేశీ పర్యటనల్లో బస చేసే హోటల్‌లో ఆయన సెక్యూరిటీ టీమ్ ప్రత్యేకంగా క్రెమ్లిన్ చెఫ్ కోసం లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆయన కోసం వంటచేసేవారు సైనిక శిక్షణ పొందినవారే.
Also Read: హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే.. వాహనదారులు రయ్‌మంటూ వెళ్లిపోయేలా..
ఏ ఆహారం తీసుకుంటారు?
కాలం మారుతున్న కొద్దీ మారుతున్న ట్రెండ్‌ని అనుసరిస్తూ ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకుంటారు కొందరు. పుతిన్ మాత్రం అందుకు భిన్నం. తాను ఇష్టపడేది, శక్తిని ఇచ్చేది, పనితీరుకు ఉపకరిస్తుందని నమ్మేదే పుతిన్ తింటారు. 2016లో టీవీ కాల్ ఇన్ కార్యక్రమంలో పుతిన్‌తో ఓ చిన్నారి మాట్లాడుతూ.. అల్పాహారంలో పొరీజ్ ఇష్టమా? అని అడిగింది.
“నేను పొరీజ్‌ను హ్యాపీగా తింటాను. ప్రతి రోజు తింటాను” అని పుతిన్ అన్నారు. చిన్నప్పుడే దాన్ని బలవంతంగా తినేవారా? అని చిన్నారి అడిగితే, “నేను చేయకూడదనుకున్న పనులను సాధారణంగా చేయను” అని చెప్పారు. బలవంతంగా తానేమీ తినబోనని, ఇష్టమైనవే తింటానని ఈ కామెంట్ ద్వారా చెప్పారు.
పోరీజ్ అంటే ఉడికించిన ధాన్యంతో చేసే ఆహారం. సాధారణంగా ఓట్స్, గోధుమ, బార్లీ వంటి ధాన్యాలను నీరు లేదా పాలలో మృదువుగా ఉడికించి తయారుచేసే ఆహారం.
సంప్రదాయ రష్యా ఆహార పదార్థాలంటే ఇష్టం
జర్నలిస్ట్ బెన్ జూడా వివరించిన వివరాల ప్రకారం.. పుతిన్ ఉదయం సమయం అలస్యంగా నిద్ర లేస్తారు. మధ్యాహ్నం తర్వాతే భోజనం చేస్తారు. ఆయన ఆహారంలో ఎల్లప్పుడూ కాటేజ్ చీజ్ ఉంటుంది. ఆమ్లెట్ లేదా కొన్నిసార్లు పొరీజ్ ఉంటుంది. ఆయనకు క్వెయిల్ గుడ్లంటే ఇష్టం. ఫ్రూట్ జ్యూస్‌ను తాగుతారు.
పుతిన్ ఎల్లప్పుడు తాజాగా ఉండే ఆహారాన్నే తింటారు. పుతిన్ తినే ఆహారంలో ఇవి ఉంటాయి
- ప్రొటీన్ (కాటేజ్ చీజ్, గుడ్లు)
- ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలు
- నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బ్స్ (పొరీజ్)
- సహజ చక్కెరలు, యాంటీ ఆక్సిడెంట్లు (ఫ్రూట్ జ్యూస్)
చార్‌గ్రాడ్ టీవీకి 2019లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ పలు వివరాలు తెలిపారు. “నాకు ప్రత్యేకంగా ఇష్టమైన ఆహారం అంటూ ఏదీ లేదు. నాకు కూరగాయలు ఇష్టం. టమాటాలు, దోసకాయలు, లెట్యూస్ ఇష్టం. ఉదయం పొరీజ్, కాటేజ్ చీజ్, తేనె, చేపలు ఇష్టం. మాంసం అయితే, గొర్రెమాంసం ఇష్టం. గ్రీన్ టీ చాలా కాలంగా అలవాటు” అని తెలిపారు.
