Prashant Kishor : పీకే చేరికపై సోనియా కీలక మీటింగ్.. ఏ బాధ్యతలు ?
సోనియా నివాసంలో కీలక సమావేశం జరుగనుంది. ఆయన పార్టీలో చేరితే అప్పగించాల్సిన బాధ్యతలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పీకే చేరిక, పీకే ఎన్నికల వ్యూహాలపై సోనియా ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే...

Pk
Sonia’s Key Meeting : ఎన్నికల వ్యూహకర్త పీకే చుట్టూ పొలిటికల్ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా ? లేడా ? అనే సస్పెన్ష్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆయన చేరికపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు పీకే అవసరమని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా సోనియా గాంధీ పలువురు పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో.. 2022, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం సోనియా నివాసంలో కీలక సమావేశం జరుగనుంది. ఆయన పార్టీలో చేరితే అప్పగించాల్సిన బాధ్యతలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పీకే చేరిక, పీకే ఎన్నికల వ్యూహాలపై సోనియా ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రాలున్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులు నివేదిక అందచేశారు. ఆయన పార్టీలో చేరితే ఇతర పార్టీలకు వ్యూహకర్తంగా పీకే పని చేయకూడదనే నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై పీకే చేసిన సూచనలను రాహుల్, ప్రియాంక గాంధీలు స్వాగతించారు.
Read More : Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్
యాంటీ బీజేపీ యాక్షన్‌ప్లాన్‌తో ఉన్న పీకేను.. కాంగ్రెస్ కలుపుకుపోయింది. సెమీఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత కుదేలైన పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి.. ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్ మీద ఉన్న హస్తం పార్టీలో ఓట్ల ఊపిరి ఊరి.. ప్రాణం నింపే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు. తన వ్యూహాలకు పదునుపెట్టి మిషన్ 400 అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదంతా గమనించిన హస్తం హైకమాండ్ పీకేను తమ నేతగా మార్చుకునేందుకు ఒప్పించింది. ఇక రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పి కీలక బాధ్యతలు కూడా అప్పగించే ఆలోచనలో ఉంది. అయితే దీనికి కొన్ని కండీషన్స్ పెట్టింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. కొంతకాలంగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మరి పీకే కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతారా ? చేరితే ఆయనకే ఏ పదవి ఇస్తారనేది చూడాలి.