పంజాబ్ స్టేట్ ఐకాన్ గా సోనూ సూద్

  • Publish Date - November 17, 2020 / 01:28 AM IST

Sonu Sood Punjab state icon : కరోనా వైరస్ మహమ్మారి సమయంలో నిరుపేదలకు సహాయం చేస్తున్నారు నటుడు సోనూ సూద్. ఇతను చేస్తున్న సహాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పంజాబ్ స్టేట్ ఐకాన్ గా భారత ఎన్నికల సంఘం నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.



ECI కి పంపిన ప్రతిపాదనను అంగీకరించిందని పంజాబ్ స్టేట్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ S Karuna Raju వెల్లడించినట్లు సమాచారం. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన వారు సోనూ సూద్. కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న సమయంలో..ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాడు. ప్రధానంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులకు చలించిపోయి..వారి వారి గ్రామాలకు చేరుకొనే విధంగా సహాయం చేశారు సోనూ. వలస కూలీలకు సదుపాయాలు కల్పించడంతో సమాజంలో ఉన్న ప్రతొక్కరూ ఆయన్ను అభినందించారు.



తాను ఈ విధంగా సేవలు చేయడానికి కారణం తన అమ్మా నాన్నలు అని చెప్పుకొచ్చారు. కష్టాల్లో ఉన్నప్పుడు అడగకముందే సహాయడం చేయడమే నిజమైన విజయంతో సమానం అని చెప్పారు. అయితే..తనను మాత్రం దేవుడితో పోల్చవద్దని సోనూ సూద్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు