అది నిజం కాదు: కూతురి పోస్టుపై గంగూలీ రియాక్షన్

బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తన కూతురి ట్వీట్ పై స్పందించారు. పౌరసత్వపు సవరణ చట్టంపై సనా గంగూలీ చేసిన దానిపై వివరణ ఇచ్చుకున్నాడు. ఆమె ఇంకా చాలా చిన్నపిల్ల అని రాజకీయాలను అర్థం చేసుకునే వయస్సు రాలేదని సర్దిచెప్పుకున్నాడు. తనను ఒంటరిగా వదిలేయాలని ట్రోలింగ్ చేయొద్దంటూ కోరాడు.
‘దయచేసి సనాను ఈ విషయాలకు దూరంగా ఉండనివ్వండి. ఈ పోస్టులో నిజం లేదు. రాజకీయాల నుంచి ఏ విషయం అర్థం చేసుకోలేని చిన్న పిల్ల’ అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు. మంగళవారం గంగూలీ కూతురు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ బుక్ పైన కవర్ ను పోస్టు చేసింది. కుశ్వంత్ సింగ్ రాసిన ‘ద ఎండ్ ఆఫ్ ఇండియా’ పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఉంది. ఆమె ఈ పోస్టు చేయడంతో కొద్ది నిమిషాల్లో ఆ పోస్టు వైరల్ అయింది.
పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులకు భారత్‌లో పౌరసత్వం కల్పించడమే దీని ఉద్దేశ్యం. 2014 డిసెంబరు 31కు ముందు భారత్‌లోకి ఎంటర్ అయినవారికి మాత్రమే. హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద, పార్శీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.