Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సౌరవ్ గంగూలీ భేటీ.. రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడా?

సౌరవ్ గంగూలీ రాజకీయ రంగప్రవేశంపై పలుసార్లు చర్చలు జరిగాయి. గతేడాది గంగూలీ అమిత్ షాను కలిసిన సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని గంగూలీ ఖండించారు. ప్రస్తుతం ఆయన మమత బెనర్జీతో భేటీ సందర్భంగా మరోసారి గంగూలీ రాజకీయ రంగప్రవేశంపై చర్చజరుగుతుండటం విశేషం.

Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోమవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌కు వెళ్లిన గంగూలీ మమత బెనర్జీతో దాదాపు 20 నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించారు. అయితే, ఈ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరిగిందో స్పష్టత రాలేదు. మమత బెనర్జీ సోమవారం ఉదయం ముర్షిదాబాద్ లో ఉన్నారు. మద్యాహ్నం సమయంలో ఆమె సెక్రటేరియట్ లోని ఆమె కార్యాలయంకు చేరుకున్నారు.

Sourav Ganguly: కోల్‌కతాలో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్న సౌరవ్ గంగూలీ.. ధర రూ.40 కోట్లు!

సౌరవ్ గంగూలీ సాయంత్రం 4గంటల సమయంలో మమత వద్దకు వెళ్లి కలిశారు. భేటీ అనంతరం మమతసైతం కార్యాలయం నుంచి బయలుదేరి ఎస్ఎస్‌కేఎంకి వెళ్లారు. అయితే, వీరిలో ఎవరూ భేటీకి సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకోకపోవటం గమనార్హం. దీంతో, గంగూలీ రాజకీయరంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, సౌరవ్ గంగూలీ రాష్ట్ర సచివాలయంలో గత ఏడాదితో కూడా భేటీ అయ్యారు.

Mamata Banerjee Supports Sourav Ganguly: దాదాకు మద్దతుగా నిలిచిన దీదీ

గత ఏడాది సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం విధితమే. గంగూలీ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకున్న తరువాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే చివరి క్షణంలో తన ప్రకటనను విరమించుకున్నాడు. అయితే, సౌరవ్ గంగూలీ రాజకీయ రంగప్రవేశంపై పలుసార్లు చర్చలు జరిగాయి. గతేడాది గంగూలీ అమిత్ షాను కలిసిన సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని గంగూలీ ఖండించారు. ప్రస్తుతం ఆయన మమత బెనర్జీతో భేటీ సందర్భంగా మరోసారి గంగూలీ రాజకీయ రంగప్రవేశంపై చర్చజరుగుతుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు