Sourav Ganguly: కోల్‌కతాలో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్న సౌరవ్ గంగూలీ.. ధర రూ.40 కోట్లు!

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో అత్యంత ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన కొన్న ఇంటి విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా.

Sourav Ganguly: కోల్‌కతాలో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్న సౌరవ్ గంగూలీ.. ధర రూ.40 కోట్లు!

Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్నట్లు సమాచారం. ఒక ఆంగ్ల మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం.. సౌరవ్ గంగూలీ ఈ ఏడాది ఏప్రిల్‌లో కోల్‌కతాలో ఒక ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు.

Munugode: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా. సౌరవ్ ఇప్పటివరకు కోల్‌కతాలోని తన పూర్వీకులు ఉన్న పాత ఇంట్లోనే ఉండేవారు. బిరెన్ రాయ్ రోడ్డులో ఉన్న బెహెలా అనే బిల్డింగులోనే తన కుటుంబంతో ఉండేవాడు. ప్రస్తుతం కోల్‌కతాలోని లోయర్ రాడాన్ స్ట్రీట్‌లో ఉన్న రెండంతస్తుల ఖరీదైన ఇంటికి మారినట్లు సమాచారం. ఈ బిల్డింగ్ విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ఈ విషయంపై సౌరవ్ గంగూలీ మీడియా సంస్థతో మాట్లాడారు. తన కొత్త ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని, అయితే పాత ఇంటిని వదిలేసి రావడం కొద్దిగా బాధ కలిగించిందని ఆయన అన్నట్లు టెలిగ్రాఫ్ అనే మీడియా సంస్థ తెలిపింది.

కాగా, క్రికెటర్‌గా సౌరవ్ గంగూలీ ఇండియన్ టీమ్‌కు విశేష సేవలందించాడు. కెప్టెన్‌గా ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. గత నెలలోనే తన పదవి నుంచి వైదొలిగారు.