విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్.. అసలేం జరుగుతోంది? భారత్ టార్గెట్‌గా భారీ కుట్ర పన్నారా?
ఫేక్ కాల్స్ విమానయాన రంగం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

Fake Bomb Threat Calls : గాల్లో విమానం, హాయిగా ప్రయాణం.. కొన్ని గంటల దూరంలో గమ్యం.. సరిగ్గా అదే సమయంలో ఒక కాల్ వస్తుంది. ఫ్లైట్ లో బాంబు ఉంది, కాసేపట్లో పేలబోతోందని.. అవతలి నుంచి ఒక గొంతు. కట్ చేస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్. ప్రయాణికుల ఇబ్బందుల మధ్య సెక్యూరిటీ చెకప్. తీరా చూస్తే కాల్ ఫేక్ అని తేలడం.
ఒకసారి, రెండుసార్లు జరిగితే ఏదో అనుకోవచ్చు. వారం రోజులుగా ప్రతీ రోజూ ఇదే సీన్. 100 ఫ్లైట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాలు మాత్రమే అనుకుంటే పొరపాటే.. రైళ్లకూ ఇవే తరహా బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఈ ఫేక్ కాల్స్ వెనుక అసలేం జరుగుతోంది? భారత్ టార్గెట్ గా భారీ కుట్ర పన్నుతున్నారా?
ఒకసారి చేసింది పదే పదే చేస్తున్నారు అంటే కచ్చితంగా దాని వెనుక కుట్ర ఉండి తీరుతుంది. బెదిరింపు కాల్స్ వెనుక అలాంటిదే ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంతకీ ఎందుకు ఇదంతా? ఎందుకీ కుట్ర? ఒక్క బెదిరింపు కాల్ ఎయిర్ పోర్టులకు 3 కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తుంది.
అసలు ఫేక్ కాల్స్ విమానయాన రంగం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? విమానాలు సరే.. రైళ్లనూ ఎందుకు టార్గెట్ చేసినట్లు. ఫ్లైట్ లో, రైల్లో ప్రయాణాలు చేయాలా? వద్దా? డేంజర్ లో ఉన్నామా? అసలు ఈ బూటకపు కాల్స్ కు బ్రేక్ వేసేది ఎలా?
Also Read : 2025లో యుగాంతమేనా? భయపెడుతున్న వంగా బాబా, నోస్ట్రడామస్ జోతిష్యం..! నిజమెంత?