Union Cabinet Reshuffle: 30మంది మంత్రులు ఔట్? కేంద్ర క్యాబినెట్లో భారీ మార్పులు చేర్పులు?
నితీశ్ కుమార్, అన్నామలైకి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆప్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంపీలకు బెర్తులు ఇస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.
Union Cabinet Reshuffle: కేంద్ర క్యాబినెట్ లో మార్పులు చేర్పులు అనే ఊహాగానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భాగస్వామ్య పక్షాలను క్యాబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. దాదాపు 30 మంది మంత్రులను పార్టీ సేవలకు పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నితీశ్ కుమార్, అన్నామలైకి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆప్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంపీలకు బెర్తులు ఇస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇక తెలంగాణ బీజేపీలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
2026లో ఇది మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్. కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు క్యాబినెట్ మీటింగ్ కు హాజరుకావాలని కేంద్రం చెప్పింది. ఈ క్యాబినెట్ భేటీలో అనేక కీలక అంశాలను ఎజెండాగా పెట్టుకుంది కేంద్రం. కేబినెట్ విస్తరణ, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో భారత్ పై ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఏయే రంగాల్లో పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది.. ఇటువంటి అంశాలతో పాటు 6 దేశాల పర్యటనలో ఆయా దేశాలతో భారత్ చేసుకున్న ఒప్పందాలపై క్యాబినెట్ లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ రీషఫుల్ కి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నెల చివరలో లేదా వచ్చే నెల మొదటి వారంలోనే కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతోందని ఇప్పటికే కొన్ని లీకులు ఇచ్చారు.
కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు వెళ్లబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రుల పనితీరుకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కేంద్రం రిపోర్ట్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. తెలంగాణ నుంచి ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి ఉన్నారు. వీరిద్దరని మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి స్థానంలో ఒక మహిళకు (డీకే అరుణకు) మంత్రి పదవి అవకాశం ఇస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇద్దరు సహాయ మంత్రులు, ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. ఏపీకి సంబంధించి కూడా కొన్ని మార్పులు జరుగుతాయని సమాచారం. పురంధేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇక, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Also Read: తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ.. 21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్.. ఆ పార్టీలకు నో చాన్స్..
