Spices Board Recruitment
Spices Board Recruitment : భారత సుగంధ ద్రవ్యాల బోర్డు, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్కెటింగ్ కన్సల్టెంట్లు, ఎక్స్‌పోర్టు ప్రమోషన్ ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అటానమస్ బాడీస్, కమోడిటీ బోర్డు విభాగాల్లో విధులు నిర్వర్తించిన విశ్రాంత(రిటైర్డ్) ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ లోగా ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు పంపాలన్నారు. సమాచారం కోసం www.indianspices.com ను సంప్రదించాలని కోరారు.