SSC Jobs : టెన్త్ అర్హతతో 25వేల ఉద్యోగాలు, రూ.69వేలు జీతం.. దరఖాస్తుకు ముగుస్తున్న గడువు
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) టెన్త్ క్లాస్ అర్హతతో 25వేల 271 జీడీ(జనరల్ డ్యూటీ) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది.

Ssc Jobs
SSC Constable : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) టెన్త్ క్లాస్ అర్హతతో 25వేల 271 జీడీ(జనరల్ డ్యూటీ) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా, దరఖాస్తు గడువు దగ్గర పడింది. ఆగస్టు 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఆగకుండా ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
18 నుంచి 23 ఏళ్ల వయసున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సీబీటీ, ఫిజికిల్, మెడికల్ టెస్టుల తర్వాత ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు లేదు. పూర్తి వివరాలకు ssc.nic.in ను చూడండి. మొత్తం పోస్టుల్లో పురుష అభ్యర్థులకు 22,424 పోస్టులు.. మహిళలకు 2847 పోస్టులున్నాయి.
అర్హతలు..
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 2, 1998 నుంచి ఆగస్టు 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
* ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి
* ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంది.
* అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పాసై ఉండాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 31, 2021
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2021
ఆఫ్‌లైన్ చలాన్ కోసం చివరి తేదీ: సెప్టెంబర్ 7, 2021
చలాన్ ద్వారా చెల్లించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 9
ఎంపిక విధానం
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (Physical Standards Test), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination) ద్వారా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.
జనరల్ ఇంటలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవర్‌నెస్, ఎలిమెంటరీ మాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి.
కంప్యూటర్ పరీక్ష ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా https://ssc.nic.in/ వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి.
వివిధ విభాగాల్లో పోస్టుల వివరాలు..
BSF – 7545
CISF – 8464
SSB – 3806
ITBP – 1431
AR – 3785
SSF – 240