SBI Amrut Kalash
SBI Amrut Kalash : భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ).. భారత్ లో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. ఎస్బీఐ తన లిమిటెడ్ ఆఫర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్ డిపాజిట్’ స్కీమ్ ను పునరుద్ధరించింది. 400 రోజుల గడువుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. గత నెల మార్చి ఆఖరుతోనే ఈ స్కీమ్ గడువు ముగిసినా మళ్లీ పునరుద్ధరించింది. వచ్చే జూన్ నెలాఖరు వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
ఈ పథకంలో నగదు డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు 7.1శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి పునరుద్ధరించిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్.. జూన్ 30వరకు అందుబాటులో ఉండనుంది. ఈ పథకం కింద డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టం కింద టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. బ్యాంక్ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు.
SBI: హోం లోన్ వడ్డీరేట్లు పెంచేసిన ఎస్బీఐ
అయితే, ఖాతాదారులు గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిటివ్ చేసుకునే అవకాశం ఉంది. స్వల్ప కాలిక లక్ష్యంతో డిపాజిట్ చేసే వారికి ఈ అమృత్ కలశ్ పథకంతో ప్రయోజనాలు ఉన్నాయి. మెచ్యూరిటీకి ముందే నగదు విత్ డ్రా చేసుకోవడంతోపాటు లోన్ సౌకర్యం కూడా కలదు.