హిమాలయాల్లో సాహసం..రికార్డు సృష్టించిన వీధి కుక్క

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 09:22 AM IST
హిమాలయాల్లో సాహసం..రికార్డు సృష్టించిన వీధి కుక్క

నేపాల్‌లో ఓ వీధి కుక్క పర్వతారోహకులను ఆశ్చర్యపరిచింది. గడ్డకట్టే చలిలో హిమాలయాల్లో 23,389 అడుగుల ఎత్తుకు చేరుకుని సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. పైగా, ఈ కుక్క ఎవరి సాయం లేకుండానే అంత ఎత్తుకు చేరుకుందన్నారు. 

బిల్లి బిర్లింగ్ అనే పర్వతారోహకులు మాట్లాడుతూ.. ‘‘ఈ కుక్కను మీరా అని పిలుస్తున్నాం. గడ్డకట్టే చలిలో 17,600 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంప్ వరకు కుక్కలు చేరుకున్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. కొన్ని కుక్కలు పర్వతారోహకులతో కలిసి 21,300 అడుగుల ఎత్తులో ఉన్న రెండో క్యాంప్‌కు కూడా చేరాయి. 

అయితే, మీరా మాత్రం 23,389 అడుగుల ఎత్తులో ఉన్న సమ్మీట్ వరకు చేరుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడి చలికి మీరా చనిపోతుందని అంతా భావించారు. కాని అది వారితో చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించిందని, వారితో కలిసి ఆహారం తిని, తమ టెంటులోనే నిద్రించిందని బిల్లి బిర్లింగ్ తెలిపారు.