Kota student suicide : కోట నగరంలో మరో విద్యార్థిని ఆత్మహత్య…ఈ ఏడాది 25కు చేరిన ఆత్మహత్యలు

Kota student suicide

Kota student suicide : రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలోని వసతిగృహంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. కోటా నగరంలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 25కు చేరింది. (student dies by suicide in Kota) కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు మానసిక అనారోగ్యం, ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 16 ఏళ్ల విద్యార్థిని రాజస్థాన్‌లోని కోటాలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Jammu and Kashmir Encounter : జమ్మూ కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది, జవాన్ మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు

రాజస్థాన్‌లోని కోచింగ్‌ హబ్‌గా ఉన్న కోటాలో ఈ ఏడాది ఎనిమిది నెలల వ్యవధిలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాంచీ నివాసి అయిన విద్యార్థిని ప్రస్తుతం నగరంలోని బ్లేజ్ హాస్టల్‌లో నివసిస్తుండేది. ఆమె ఉరి వేసుకుని చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు అర్హత సాధించాలనే ఆశతో ఏటా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు కోటా నగరానికి వస్తుంటారు.

Road Accident : జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కు ఢీ… 11 మంది మృతి

2022వ సంవత్సరంలో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటాలో ఆత్మహత్యల పరంపరపై స్పందించిన జిల్లా యంత్రాంగం గతంలో అన్ని హాస్టల్ గదుల్లో స్ప్రింగ్‌ లోడెడ్ ఫ్యాన్‌లను తప్పనిసరిగా అమర్చాలని, పేయింగ్ గెస్ట్ వసతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల మానసిక కౌన్సెలింగ్‌పై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను కోర్టు నొక్కి చెప్పింది.