Sudha Murty
Sudha Murty : రచయిత్రి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తరచూ వార్తల్లో ఉంటారు. తాజాగా సుధామూర్తి కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు ఆవిడ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సింప్లిసిటీకి మారు పేరు సుధామూర్తి. కట్టు,బొట్టు చక్కని మాటతీరుతో ఉండే సుధామూర్తిని ఎంతోమంది అభిమానిస్తారు. ఆవిడ చెప్పే మాటలు చాలామందిలో ప్రేరణ కలిగిస్తుంటాయి. పలు ఇంటర్వ్యూల్లో సుధామూర్తి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా సుధామూర్తి కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. దీనిని సందర్శించడంతో తన కల నెరవేరిందంటూ మీడియాతో మాట్లాడారు సుధామూర్తి .
Sudha Murty : సుధామూర్తి సిబ్బందినంటూ డబ్బులు వసూళ్లు .. వ్యక్తి అరెస్ట్, ఇద్దరు మహిళలపై కేసు నమోదు
మొదటి సార్లి పార్లమెంటు భవనాన్ని సందర్శించినట్లు సుధామూర్తి చెప్పారు. భవన నిర్మాణం అద్భుతంగా ఉందని మాటల్లో చెప్పలేనని పేర్కొన్నారు. లోపల ఆర్ట్, కల్చర్, ఇండియన్ హిస్టరీ అన్నింటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. తక్కువ టైమ్‌లో ఇంత అందంగా నిర్మించారని ఆమె అన్నారు. మీరు అధికారికంగా లోపల అడుగుపెట్టాలని అనుకుంటున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు నవ్వుతూ తను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కొత్త పార్లమెంటు భవనం ఈ ఏడాది మే 28 న ప్రధాని మోదీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ప్రారంభించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి రూ.970 కోట్ల రూపాయలు ఖర్చైంది.
#WATCH | Delhi | As Sudha Murty visits the Parliament, she says, “It is so beautiful…No words to describe. I wanted to see this for a long time. It was a dream come true today. It is beautiful…It’s art, culture, Indian history – everything is beautiful…” pic.twitter.com/P2kKp2Wj2o
— ANI (@ANI) December 8, 2023