Sundar Pichai: కొలువుల కోత తప్పదు.. ఉద్యోగులకు మరోసారి స్పష్టం చేసిన సుందర్ పిచాయ్
గూగుల్‌లో మాస్ లేఆఫ్స్‌పై స్పష్టత కోసం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని ఉద్యోగులు మరోసారి వివరణ కోరినట్లు తెలిసింది. అయితే, సీఈవో మాత్రం ఉద్యోగుల ప్రశ్నకు కుండబద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారట. ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్ ను ఊహించడం కష్టమని, ముందుచూపుతో తాను ఎలాంటి హామీలు ఇవ్వలేనని పిచాయ్ స్పష్టం చేశారట.

Sundar Pichai
Sundar Pichai: అమెజాన్, ట్విటర్, మెటా వంటి బడా సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ట్విటర్ సగం మంది ఉద్యోగులను తొలగించగా, మెటా, అమెజాన్ లు తమ సంస్థల్లోని ఉద్యోగులపై వేటువేశాయి. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సైతం లేఆఫ్స్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే లేఆఫ్స్ తప్పవని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంకేతాలు పంపడంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ రాబోయే వారం రోజుల్లో 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తుందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగుల్లో మరింత ఆందోళన పెరిగింది.
గూగుల్‌లో మాస్ లేఆఫ్స్‌పై స్పష్టత కోసం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని ఉద్యోగులు మరోసారి వివరణ కోరినట్లు తెలిసింది. అయితే, సీఈవో మాత్రం ఉద్యోగుల ప్రశ్నకు కుండబద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారట. ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్ ను ఊహించడం కష్టమని, ముందుచూపుతో తాను ఎలాంటి హామీలు ఇవ్వలేనని పిచాయ్ స్పష్టం చేశారట. దీంతో మరోసారి కొలువుల కోత తప్పదనే సంకేతాలును ఇచ్చారట. కీలక రోల్స్ మినహా హైరింగ్ ను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Sundar Pichai : కంపెనీలో చేసే పని కన్నా ఉద్యోగులే ఎక్కువ.. కోత తప్పదంటున్న గూగుల్ బాస్..!
మరోవైపు గ్రాడ్ అనే న్యూ పెర్ఫామెన్స్ టూల్ ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నాలు చేపట్టడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ లేఆఫ్స్ లో భాగంగా వడపోతల కోసమేనని టెకీలు పేర్కొంటున్నారు.