ప్రధాని మోడీ కీలక నిర్ణయం: ఎందుకు?

డిజిటల్ ప్రపంచం ప్రభావం పెరిగిపోయాక రాజకీయ నాయకుల ప్రకటనలు పత్రికలు, టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాని వాడుకోకుండా ఏ రాజకీయ పార్టీ లేదు.. ఏ నాయకుడు కూడా లేడు.. సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో ప్రధాని మోడీ ఒకరు. ట్విట్టర్‌లో ప్రధాని మోడీకి 5.33 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3 కోట్లపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్ బుక్‌లో నాలుగు కోట్ల 46లక్షల మంది మోడీ పేజ్‌ని ఫాలో అవుతున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ కానీ అధికారంలోకి రెండు సార్లు వచ్చారంటే అందులో కచ్చితంగా సోషల్ మీడియా ప్రభావం ఉందనే విషయాన్ని కచ్చితంగా చెప్పాలి. అటువంటిది ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో ప్రధాని మోడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏంటీ? ఆ నిర్ణయం.. ఆదివారం(8 మార్చి 2020) నుంచి తన ఫేస్‌బుక్, ట్వీట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూ ట్యూబ్ వాడబోమని మోడీ స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా నుంచి తప్పుకొంటాననే మోడీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 14.9 మంది మిలియన్ల ఫాలొవర్లు ఉండగా.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 24.8 మిలియన్ల ఫాలొవర్లు మాత్రమే ఉండేవారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోడీ టాప్-2లో ఉన్నారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొదటి స్థానంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారు. అయితే మోడీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఇప్పటివరకు చేసిన పోస్టింగ్‌లు మాత్రం అలాగే ఉంటాయి అని ప్రకటించారు మోడీ.
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020