Ag Peri
AG Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివాలన్‌ను బెయిల్ పై విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంమైన ఈ అంశంలో తమిళనాడు రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉంటారని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపాలన్న గవర్నర్ చర్యను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే కళ్లు మూసుకోలేమని పేర్కొంది. “అర్హతలపై వాదించేందుకు మీరు(కేంద్రం) సిద్ధంగా లేనందున ఆయనను జైలు నుంచి విడుదల చేయమని ఆదేశాలు జారీ చేస్తామని” సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై రాష్ట్రపతి నిర్ణయం కోసం కోర్టు వేచి ఉండాలన్న కేంద్రం అభిప్రాయంతో కోర్టు ఏకీభవించలేదు.
Also read:SmritiIrani in Wayanad: రాహుల్ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ: వాయనాడ్ కూడా లాగేసుకుంటారా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం తమిళనాడు కేబినెట్ ఇచ్చే సహాయ, సలహాలకు గవర్నర్ కట్టుబడి ఉంటారని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి తెలిపింది. దీనిపై వచ్చే వారంలోగా స్పందించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఇది కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్‌కి ధర్మాసనం తెలిపింది. గవర్నర్ నిర్ణయం కూడా అవసరం లేదని, కేబినెట్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కోర్టు వివరించింది.
Also read:Kashmir valley: కాశ్మీర్ తీవ్రవాదుల చేతిలో అమెరికన్ ఆయుధాలు
కేంద్రం తరఫున హాజరైన నటరాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ రాష్ట్రపతికి ఫైల్‌ను పంపినట్లు తెలిపారు. అయితే చట్టానికి అతీతంగా ఎవరూ లేరని, అర్హతల ఆధారంగా వాదించడానికి మీరు సిద్ధంగా లేనందున అతన్ని జైలు నుండి విడుదల చేయమని ఆదేశించనున్నట్లు కోర్టు పేర్కొంది. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నా కళ్లు మూసుకోలేం, రాజ్యాంగాన్ని అనుసరించాలి. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read:Chidambaram: చిదంబరానికి కాంగ్రెస్ లాయర్ల నిరసన సెగ