ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.

Supreme Court

Supreme Court : ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read : Arvind Kejriwal : ఎనిమిదోసారి విచారణకు దూరంగా కేజ్రీవాల్.. మార్చి 12 తరువాత హాజరువుతానని వెల్లడి

రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(2), ఆర్టికల్ 105(2) ప్రకారం సభలో చేసిన ఏ ప్రసంగం లేదా ఓటువేసినా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులకుఉన్న మినహాయింపు ఇక చెల్లదని సుప్రీంకోర్టు
తెలిపింది. 1998లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. పీవీ నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో ఇచ్చిన మెజారిటీ తీర్పును సుప్రీంకోర్టు పునః సమీక్షించింది. పీవీ నరసింహరావు కేసు తీర్పుతో మేము విభేదిస్తున్నాం. ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై శాసనసభ్యుడికి మినహాయింపునిస్తూ పీవీ నరసింహారావు కేసులోని తీర్పు విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది. దీన్ని రద్దు చేస్తున్నామని, శాసన విధులను నిర్వర్తించడానికి అటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

Also Read : Supreme Court On Bilkis Bano Case : గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ

లంచం తీసుకొని శాసన సభ, పార్లమెంట్ లో మాట్లాడటం, ఓటు వేయడం నెరపురిత చర్య. ప్రజాప్రతినిధి లంచం తీసుకోవటం నేరం. పీవీ నర్సింహ తీర్పు ఆర్టికల్స్ 105/194కు విరుద్ధం అని సుప్రీంకోర్టు పేర్కొంది. లంచం పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షించబడదు. శాసన అధికారాల ఉద్దేశం, లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అధికారాలు సమిష్టిగా చట్టసభకు ఉంటాయి. ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అవినీతి, శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.

 


 

ట్రెండింగ్ వార్తలు