Arvind Kejriwal : ఎనిమిదోసారి విచారణకు దూరంగా కేజ్రీవాల్.. మార్చి 12 తరువాత హాజరువుతానని వెల్లడి

మార్చి 12 తరువాత విచారణకు సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ ఈడీకి సమాధానం పంపించినట్లు ఆప్ ఒక ప్రకటనలో తెలిపింది.

Arvind Kejriwal : ఎనిమిదోసారి విచారణకు దూరంగా కేజ్రీవాల్.. మార్చి 12 తరువాత హాజరువుతానని వెల్లడి

Arvind Kejriwal

Arvind Kejriwal Sends Reply To ED Summons : లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదోసారి దూరంగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ కు నాలుగు నెలలుగా ఈడీ నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం, కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటూ వివిధ కారణాలతో ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారు. ఫిబ్రవరి 27న కేజ్రీవాల్ కు 8వ సారి  ఈడీ సమన్లు పంపించింది.. మార్చి 4న విచారణకు రావాలని కోరింది. అయితే, కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఈడీకి ఢిల్లీ సీఎం కొన్ని షరతులు పెట్టినట్లు తెలిసింది.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి నోటీసులు

మార్చి 12 తరువాత ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ ఈడీకి సమాధానం పంపించినట్లు ఆప్ ఒక ప్రకటనలో తెలిపింది. తనకు ఈడీ జారీ చేస్తున్న నోటీసులు చట్ట విరుద్దమన్న కేజ్రీవాల్ .. సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో మార్చి 12వ తేదీ తరువాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ఈడీకి కేజ్రీవాల్ తెలిపినట్లు ఆప్ ప్రకటనలో పేర్కొంది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ ఎనిమిదో సారి గత నెల 27న కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, కోర్టులో ఈడీ విచారణ అంశం పెండింగ్ లో ఉండటంతో నేటి విచారణకు దూరంగా ఉంటున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు అంశంపై ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. గతంలో విచారణ సందర్భంగా మార్చి 16కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అర్వింద్ కేజ్రీవాల్‌కు నాల్గవసారి ఈడీ సమన్లు జారీ

ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎంను విచారించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21న, జనవరి 3న, జనవరి 18న, ఫిబ్రవరి 2న, ఫిబ్రవరి 19న, ఫిబ్రవరి 22న, ఫిబ్రవరి 27న కేజ్రీవాల్ కు విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ మాత్రం ఈడీ విచారణకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధం అని, ప్రతిపక్ష కూటమి నుంచి ఆప్ వైదొలగాలని కేజ్రీవాల్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఒక సాధనంగా మోదీ సర్కార్ ఉపయోగిస్తుందని ఇండియా బ్లాక్ మిత్రపక్షం ఆరోపించింది.