Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అర్వింద్ కేజ్రీవాల్‌కు నాల్గవసారి ఈడీ సమన్లు జారీ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు జారీ చేసిన మూడు సమన్లను దాటవేశారు....

Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అర్వింద్ కేజ్రీవాల్‌కు నాల్గవసారి ఈడీ సమన్లు జారీ

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు జారీ చేసిన మూడు సమన్లను దాటవేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ జనవరి 18వతేదీన హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం నాలుగో సమన్లు జారీ చేసింది.

ALSO READ : China coal mine accident : చైనా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం…8 మంది మృతి, మరో 8 మంది గల్లంతు

గత ఏడాది నవంబర్ 2, డిసెంబరు 21వ తేదీల్లో రెండుసార్లు ఈడీ సమన్లు పంపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈడీ ముందు విచారణకు హాజరు కావడానికి నిరాకరించారు. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమైనదని కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘‘ఈడీ సమన్లను ఉపసంహరించుకోవాలి. నేను నా జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా గడిపాను. నేను దాచడానికి ఏమీ లేదు’’ అని సీఎం పేర్కొన్నారు.

ALSO READ : YS Sharmila : చంద్రబాబు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం

మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈడీ గత ఏడాది అక్టోబర్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు మొదటిసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏప్రిల్‌లో ప్రశ్నించింది, అయితే సీబీఐ సీఎంను నిందితుడిగా చేర్చలేదు. ఢిల్లీ మద్యం కేసులో ఆప్ సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో నేత సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.