China coal mine accident : చైనా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం…8 మంది మృతి, మరో 8 మంది గల్లంతు

చైనా దేశంలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. హెన్నాన్ ప్రావిన్సులోని పింగ్ డింగ్ షాన్ నగరంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించగా, మరో 8 మంది గల్లంతయ్యారు....

China coal mine accident : చైనా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం…8 మంది మృతి, మరో 8 మంది గల్లంతు

China coal mine accident

China coal mine accident : చైనా దేశంలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. హెన్నాన్ ప్రావిన్సులోని పింగ్ డింగ్ షాన్ నగరంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించగా, మరో 8 మంది గల్లంతయ్యారు. శుక్రవారం పింగ్ డింగ్ షాన్ నగరంలోని టినాన్ కోల్ మైనింగ్ కో లిమిటెడ్ బొగ్గుగనిలో ప్రమాదం జరిగినపుడు లోపల 425 మంది కార్మికులున్నారు. బొగ్గు గనిలో బొగ్గు, గ్యాస్ పేలుడు వల్ల ప్రమాదం జరిగింది.

ALSO READ : 2000 Flights Cancelled : అమెరికాలో మంచు తుపాన్ ఎఫెక్ట్ : 2వేల విమాన సర్వీసుల రద్దు

ఈ ప్రమాదం నుంచి 380 మంది సురక్షితంగా బయటపడ్డారు. బొగ్గుగనిలో 45 మంది కార్మికుల కోసం గాలిస్తున్నారు. బొగ్గు గని ప్రమాదంలో 8 మంది మరణించగా, మరో 8 మంది గల్లంతయ్యారు. శనివారం చైనా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ బొగ్గుగనిలో ప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చైనా అధికారులు చెప్పారు.