babri masjid demolition case
Babri Demolition Case: బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన 30 ఏళ్ల తర్వాత, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో తలెత్తిన అన్ని విచారణలను సుప్రీంకోర్టు మంగళవారం మూసివేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇతర అధికారులపై దాఖలైన అన్ని ధిక్కార పిటిషన్లను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని, ధిక్కార కేసులను కొనసాగించలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
Babri Masjid Demolition Verdict తీర్పుపై ఉత్కంఠ..అసలు ఏం జరిగింది
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు 1992 డిసెంబర్ 6న నమోదైంది. ఈ కేసులో 1,026 మంది సాక్షులు, 49 మంది నిందితులుగా నమోదు చేయబడ్డారు. అందులో ప్రస్తుతం 17 మంది మరణించారు. అందువల్ల మిగిలిన 32 మంది నిందితులపై కోర్టు తన తీర్పు ప్రకటించింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి యూపీ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్, తదితరులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రింకోర్టు ముగించింది.
బాబ్రి కేసు: ఎల్ కే అద్వానీ, మరో 31 మంది నిర్దోషులే.
పిటీషనర్ కళ్యాణ్ సింగ్ మరణాన్ని ఉటంకిస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దివంగత నేత కోర్టు ధిక్కారానికి సంబంధించిన కేసును సుప్రీంలో ఎత్తివేసింది. ఈ విషయంపై ఇప్పటికే పెద్ద బెంచ్ తీర్పు వెలువరించిందని, ఈ విషయంలో ఇప్పుడు ఏమీ మనుగడలో లేదని కోర్టు పేర్కొంది.