Jammu And Kashmir Delimitation : జమ్మూకాశ్మీర్‌ డీలిమిటేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిపాదిత డీలిమిటేషన్‌ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Jammu And Kashmir Delimitation : జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిపాదిత డీలిమిటేషన్‌ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా తీర్పు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. జమ్మూ కాశ్మీర్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత సంజయ్ కిషన్ కౌల్ మరియు ఎఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం తీర్పును డిసెంబర్ 1న రిజర్వ్ చేసింది. డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం లేదని పిటీషనర్లు వాదించారు.

Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం డీలిమిటేషన్‌ను 2026 తర్వాత మాత్రమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ జమ్మూ-కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి దీని నుండి ప్రత్యేకించబడిందని కోర్టుకు కేంద్రం తెలిపింది. జమ్మూ – కాశ్మీర్ డీలిమిటేషన్ ప్రక్రియ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2019లో జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370)ను రద్దు చేసిన తర్వాత రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ – కాశ్మీర్ విడిపోయింది.

జమ్మూ కాశ్మీర్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. గతేడాది మే నెలలో డీలిమిటేషన్ ప్యానెల్ కసరత్తు పూర్తి చేసింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ మరియు 5 పార్లమెంటరీ నియోజకవర్గాలను జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కమిషన్ పునర్నిర్మించింది.

ట్రెండింగ్ వార్తలు