ప్రమోషన్ : సుప్రీంకోర్టు జస్టిస్ లుగా దినేశ్, సంజీవ్ ప్రమాణం

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 07:21 AM IST
ప్రమోషన్ : సుప్రీంకోర్టు జస్టిస్ లుగా దినేశ్, సంజీవ్ ప్రమాణం

ఢిల్లీ :  హైకోర్ట్ జడ్డీలకు ప్రమోషన్ కల్పిస్తు కొలిజీయం తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు జస్టిస్ లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేసారు. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా జనవరి 18న ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఖన్నా చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారం చేయించారు. 

జస్టిస్ దినేశ్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమమూర్తిగా పని చేశారు. ఈ క్రమంలో వీరికి ప్రమోషన్ నిమిత్తం సుప్రీం న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు.  దీంతో ఇప్పటి వరకూ 26గా వున్న సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఎస్‌ఏ బాంబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన కొలీజియం ఈ నెల 10వ తేదీన ఈ ఇద్దరు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేయటంతో వీరిద్దరు ఈరోజు ప్రమాణం చేశారు.