Jammu Kashmir: ఆర్టికల్ 35-ఏ రద్దుతో జమ్మూ కశ్మీరీల ముఖ్యమైన హక్కులు రద్దయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామకం, స్థిరాస్తిని పొందే హక్కుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఉద్యోగ హక్కుకు సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసిన సీజేఐ.. ఈ చర్య వల్ల పౌరుల నుంచి వీటన్నింటిని దూరం చేసిందని అన్నారు

Supreme Court: సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370పై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 35-ఏ పౌరుల అనేక ప్రాథమిక హక్కులను హరించివేసిందని విచారణ సందర్భంగా ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో పౌరులకు ఉపాధి, సమాన అవకాశాలను, ఆస్తిని పొందే హక్కులను హరించాయని, ఈ హక్కులు ప్రత్యేకంగా నాన్-రెసిడెంట్ల నుంచి తీసివేయబడ్డాయని పేర్కొన్నారు.
రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామకం, స్థిరాస్తిని పొందే హక్కుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఉద్యోగ హక్కుకు సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసిన సీజేఐ.. ఈ చర్య వల్ల పౌరుల నుంచి వీటన్నింటిని దూరం చేసిందని అన్నారు. ఎందుకంటే ఇవి నివాసితుల ప్రత్యేక హక్కులని, నివాసేతరుల హక్కుల నుంచి మినహాయించబడ్డాయని పేర్కొన్నారు. రాజ్యాంగ సూత్రం ప్రకారం భారత ప్రభుత్వం ఒకే సంస్థ అని అన్నారు. భారత ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
Bengaluru : చదువుకి వయసుకి సంబంధం లేదని నిరూపించిన ఆటోడ్రైవర్.. 38 ఏళ్ల క్రితం చదువు మానేసి..
గతంలో చేసిన తప్పు రాబోయే తరాలను ప్రభావితం చేయదని కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించిన అనంతరం సీజేఐ పై విధంగా స్పందించారు. ‘‘జమ్మూ కశ్మీర్ రాజ్యాంగం కంటే ఉన్నతమైన వేదికపై ఉన్న పత్రం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని మీరు ఒక స్థాయిలో చెప్పవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. జమ్మూ కాశ్మీర్‌లోని రాజ్యాంగ సభ శాసనసభ. కానీ శాసనసభ రాజ్యాంగ సభ కాదని చూపించడానికి మీరు ప్రయత్నించారు. ఇది సరైుది కాదు. ఎందుకంటే ఆర్టికల్ 238 రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. అందుకే అసెంబ్లీ అని అనడం సరికాకపోవచ్చు’’ అని సీజేఐ అన్నారు.
MLA Raja Singh: అవసరమైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా..! ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. అన్ని కేసులను సవరణలతో అమలు చేశామని తుషార్ మెహతా తెలిపారు. ఉదాహరణకు, ఆర్టికల్ 368 అమలు చేశారు. అయితే ఆర్టికల్ 370 ఉంటే భారత రాజ్యాంగానికి చేసిన ఏదైనా సవరణ జమ్మూ కశ్మీర్‌కు వర్తించదు. ఉదాహరణకు, భారత రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్ 21A కింద విద్యా హక్కును చేర్చారు. 2019 వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఇది అమలు కాలేదు. ఎందుకంటే ఆర్టికల్ 370 ప్రకారం.. అక్కడి శాసనసభ అంగీకరిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35-ఏను భారత పార్లమెంట్ 2019 ఆగస్టులో రద్దు చేసింది.